https://oktelugu.com/

Krishnabhagavan: ఆ కమెడియన్ నన్ను ఇండస్ట్రీలో తొక్కేశాడు.. క్యాష్ షోలో గుట్టువిప్పిన కృష్ణ భగవాన్!

Krishnabhagavan: తెలుగులోని టాలెంటెడ్ కమెడియన్ల జాబితాను పరిశీలిస్తే ఆ జాబితాలో కృష్ణ భగవాన్ ముందువరసలో ఉంటారు. ఈ మధ్య కాలంలో కృష్ణ భగవాన్ కు సినిమాలలో ఆఫర్లు ఎక్కువగా రాకపోయినా సరైన పాత్ర పడితే కృష్ణభగవాన్ మళ్లీ బిజీ అవుతారనడంలో సందేహం అవసరం లేదు. ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న క్యాష్ షో ప్రోమో తాజాగా రిలీజ్ కాగా ఈ షోలో సమీర్, కృష్ణ భగవాన్, హేమ, పోసాని కృష్ణమురళి హాజరయ్యారు. సుమ షోలో తనదైన శైలిలో […]

Written By: , Updated On : April 16, 2022 / 10:32 AM IST
Follow us on

Krishnabhagavan: తెలుగులోని టాలెంటెడ్ కమెడియన్ల జాబితాను పరిశీలిస్తే ఆ జాబితాలో కృష్ణ భగవాన్ ముందువరసలో ఉంటారు. ఈ మధ్య కాలంలో కృష్ణ భగవాన్ కు సినిమాలలో ఆఫర్లు ఎక్కువగా రాకపోయినా సరైన పాత్ర పడితే కృష్ణభగవాన్ మళ్లీ బిజీ అవుతారనడంలో సందేహం అవసరం లేదు. ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న క్యాష్ షో ప్రోమో తాజాగా రిలీజ్ కాగా ఈ షోలో సమీర్, కృష్ణ భగవాన్, హేమ, పోసాని కృష్ణమురళి హాజరయ్యారు.

సుమ షోలో తనదైన శైలిలో పంచ్ లు వేసి అలరించగా కృష్ణ భగవాన్ వేసిన పంచ్ లు అయితే కడుపుబ్బా నవ్వించాయి. సుమ ఆప్షన్స్ ఇచ్చి ప్రశ్న అడగకముందే కృష్ణభగవాన్ ఆప్షన్ ఏ అని సమాధానం ఇవ్వగా ప్రశ్న విన్న తర్వాత సమాధానం చెప్పాలని సుమ పంచ్ వేశారు. అయితే కృష్ణభగవాన్ మాత్రం తాను బీకాం అలానే పాసయ్యానంటూ పంచ్ వేశారు. పోసాని మీరు మారిపోయారు మేడమ్ అని సుమతో చెప్పగా కృష్ణ భగవాన్ మాత్రం మీరేం మారలేదని ఫస్ట్ షోలో చెప్పిన జోకులు ఇప్పటికీ చెబుతున్నారని కృష్ణ భగవాన్ అన్నారు.

సుమ సమీర్ కు సన్మానం చేస్తామని చెప్పగా చెయ్యండని బయట ఎలాగో జరగదని కృష్ణభగవాన్ అదిరిపోయే పంచ్ పేల్చారు. సుమ పోసానికి తమిళం కూడా వచ్చని చెప్పగా అయితే కన్నడలో మంచి వేషం ఇస్తానని కృష్ణ భగవాన్ నవ్వులు పూయించారు. సుమ మీ లైఫ్ లో మీరు ఆశ్చర్యానికి గురైన సంఘటన ఏమిటని కృష్ణ భగవాన్ ను అడగగా కృష్ణ భగవాన్ రఘుబాబుకు, మరో ఆవిడకు నంది అవార్డ్ రావడం అని చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలో ఎవరైనా మిమ్మల్ని తొక్కేయాలని చూశారా అని సుమ అడగగా కృష్ణ భగవాన్ రఘుబాబే అని అన్నారు. ఎవరైనా ఒకరిని తుక్కుతుక్కు కింద కొట్టమంటే ఎవరిని కొడతారని సుమ అడగగా రఘుబాబుని కొడతానని కృష్ణ భగవాన్ అన్నారు. అయితే రఘుబాబు గురించి కృష్ణ భగవాన్ సరదాగానే చెప్పారని నెటిజన్లు భావిస్తున్నారు. కృష్ణభగవాన్ కామెడీ టైమింగ్ వేరే లెవెల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.