https://oktelugu.com/

Pawan Kalyan vs Jagan : పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కోలేక అడ్డదారులు తొక్కుతున్న జగన్

మొన్న జోగిరమేష్, నిన్న వాసిరెడ్డి పద్మలు నేరుగా పవన్ కళ్యాణ్ పై అటాక్ చేయడం వెనుక జగన్ రాజకీయం ఉంది. జగన్ సూత్రధారి అయితే వీళ్లు పాత్రధారులు.. జగన్ ఉండగానే జోగిరమేష్ తో స్టేజీమీదనే మాట్లాడించుకొని పవన్ ను తిడుతుంటే ముసిముసినవ్వాడు.

Written By: , Updated On : July 28, 2023 / 04:08 PM IST
Follow us on

Pawan Kalyan vs Jagan : ఏపీ సీఎం జగన్ కు కలలో కూడా పవన్ కళ్యాణ్ వస్తున్నట్టు కనిపిస్తోంది. నిద్ర కూడా పట్టడం లేదనుకుంటా.. ఎందుకంటే వారాహి యాత్ర తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి ఎలా మారిందనే దానిపై ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందట.. అక్కడ నుంచి జగన్ లో భయం మొదలైంది.

ఇప్పటివరకూ జగన్ చాలా ధీమాగా ఉన్నారు. సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని అనుకున్నాడు. ఎంతమంది ఏం చేసినా నాకేం అడ్డు లేదని అనుకున్న వ్యక్తికి.. మొట్టమొదటి సారి పవన్ కళ్యాణ్ విషయంలో భయం పట్టుకుంది.

మొన్న జోగిరమేష్, నిన్న వాసిరెడ్డి పద్మలు నేరుగా పవన్ కళ్యాణ్ పై అటాక్ చేయడం వెనుక జగన్ రాజకీయం ఉంది. జగన్ సూత్రధారి అయితే వీళ్లు పాత్రధారులు.. జగన్ ఉండగానే జోగిరమేష్ తో స్టేజీమీదనే మాట్లాడించుకొని పవన్ ను తిడుతుంటే ముసిముసినవ్వాడు.

పవన్ కళ్యాణ్ చట్టప్రకారం ప్రస్తుతం ఒక స్త్రీతోనే ఉంటున్నాడు. మూడు పెళ్లాళ్లు అంటే అది లీగల్ గా కేసు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చిన మహిళల పరిస్థితి ఎలా ఉంటుందన్నది వైసీపీ నేతలు ఆలోచించడం లేదు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఇలా దిగజారి మహిళలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం ఎంత వరకు కరెక్ట్ ఆలోచించాలి.

పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కోలేక అడ్డదారులు తొక్కుతున్న జగన్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కోలేక అడ్డదారులు తొక్కుతున్న జగన్ | Pawan Kalyan | Jagan | Ok Telugu