Telangana Elections 2023: బీఆర్‌ఎస్‌ను బీట్‌ చేయడం కాంగ్రెస్‌కు కష్టమే..

2018లో బీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. విపక్ష పార్టీలు ఎన్నికలకు సిద్ధం లేని సమయం చూసి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్లారు.

Written By: Raj Shekar, Updated On : November 28, 2023 11:43 am

Telangana Elections 2023

Follow us on

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మూడు ప్రధాన పార్టీలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. మూడోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్‌ అండ్‌ కో ప్రయత్నిస్తోంది. కేసీఆర్‌ సర్కార్‌ను గద్దె దించాలని బీజేపీ, కాంగ్రెస్‌ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మరోవైపు పలు సర్వే సంస్థలు తమ ఎనాలసిస్‌ను ప్రజల్లోకి వదిలాయి. ఇందులో కొన్ని బీఆర్‌ఎస్‌కు, కొన్ని కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితాలు వెల్లడించాయి. కొన్ని సర్వేలు హంగ్‌ వస్తుందని తేల్చాయి. తాజా పరిస్థితి చూస్తుంటే మాత్రం కాంగ్రెస్‌ గెలుస్తుందన్న మౌత్‌ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక బీఆర్‌ఎస్‌లో కూడా కాస్త ఆందోళన కనిపిస్తోంది. కానీ, బీఆర్‌ఎస్‌ను బీట్‌ చేయడం కాంగ్రెస్‌తో ప్రస్తుతం అయ్యే పని కాదంటున్నారు సీఎస్డీఎస్‌(సెంటర్‌ ఫర్‌ ది స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌) సంజయ్‌కుమార్‌.

గత ఫలితాల ఆధారంగా..
2018లో బీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. విపక్ష పార్టీలు ఎన్నికలకు సిద్ధం లేని సమయం చూసి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్లారు. ఈ సమయంలో అధికార బీఆర్‌ఎస్‌ 45 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్‌ 24 శాతంతో వెనుకబడింది. ఈసారి కూడా కాంగ్రెస్‌ అంతగా పుంజుకోలేదని సంజయ్‌కుమార్‌ తెలిపారు. తమ స్టడీలో బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్‌ పుంజుకుందని తేలినా.. అది బీఆర్‌ఎస్‌ను ఓడించేంతగా లేదని గుర్తించినట్లు వెల్లడించారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ మధ్య ఓట్ల శాతంలో తేడా 19 ఉందని, ఇటీవలే పుంజుకున్న కాంగ్రెస్‌ ఇంత తక్కువ సమయంలో అంత గ్యాప్‌ పూడ్చేస్థాయిలో ఓట్లు సాధించకపోవచ్చని వెల్లడించారు. ఇక బీజేపీ మూడోస్థానానికే పరిమితమవుతుందని తెలిపారు.

బీఆర్‌ఎస్‌కే మళ్లీ అధికారం..
సీఎస్డీఎస్‌ సంజయ్‌ అంచనా ప్రకారం తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో ప్రచారం మాత్రం తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటోందని అంటున్నారు. ఇలాంటి తరుణంలో ఎవరి అంచనాలు నిజమవుతాయో చూడాలి.