IT Attack On Malla Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ముందు నుంచి భావిస్తున్నట్లుగానే ఆ పార్టీ నేతలపై ఐటీ దాడులు మొదలయ్యాయి.. వ్యాపారాలు చేస్తూ.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతలుగా ఉన్న వారిని ఐటీ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈవిషయం గులాబీ బాస్‌కు ముందే అర్థమై హెచ్చరించారు. కానీ.. వ్యాపారల్లో ఉన్నవారు సరిదిద్దుకునేలోపే ఐటీ అటాక్ మొదలు పెట్టింది. దీంతో అధికార పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేసీఆర్ కేంద్రంతో లొల్లి పెట్టుకోవడం ఏమో కానీ తాము బలవుతామేమో అని టెన్షన్ పడుతున్నారు. మొరోవైపపు ఐటీ టెన్షన్ బడా వ్యాపారులైన టీఆర్‌ఎస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

టార్గెట్ మినిస్టర్ మల్లారెడ్డి..
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి విద్యాసంస్థలతోపాటు ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అపర కుబేరుడిగా ఆయనకు పేరుంది. దీంతో ఐటీ అధికారులు మల్లారెడ్డి ఇళ్లు, వ్యాపార సంస్థలు, బంధువుల ఇళ్లపై మంగళవారం దాడులకు దిగారు. కనీసం 50 బృందాలతో సోదాలు చేస్తున్నారు.
లెక్కలేనన్ని వ్యాపారాలు..
మల్లారెడ్డి అపర కుబేరుడు. ఆయనకు ఇంజినీరింగ్ కాలేజీలు.. మెడికల్ కాలేజీలు.. ఇతర వ్యాపారాలు ఉన్నాయి. ఆయనపై అనేక భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. అవకతవకలకు పాల్పడ్డారని గతంలో రేవంత్‌రెడ్డి ఐటీ, ఈడీకి ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాపార సంస్థలపై రేవంత్‌రెడ్డి చాలా సార్లు ఫిర్యాదులు చేశారు. అయితే అప్పట్లో దర్యాప్తు సంస్థలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం.. టీఆర్‌ఎస్‌తో చెడటంతో పెద్దఎత్తున రంగంలోకి దిగారు. అన్నీ బయటకు తీసే చాన్స్ ఉంది.
మెడికల్ సీట్లపై ఆరోపణలు..
మల్లారెడ్డి మెడికల్ కాలేజీల్లో సీట్ల వ్యవహారంపై లెక్క లేనన్ని ఆరోపణలు వచ్చాయి. పన్ను ఎగవేత అంశాలపై ఫిర్యాదులు ఉన్నాయి. వీటన్నింటి గుట్టు బయటపడితే మల్లారెడ్డి ఇరుక్కుపోయినట్లే. తెలుగుదేశం పార్టీ ఎంపీగా మల్కాజిగిరి నుంచి పోటీ చేసి గెలిచిన మల్లారెడ్డి.. తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. నిజానికి ఆయన విద్యావంతుడు కాదు. పదో తరగతి వరకే చదువుకున్నారు. పాల వ్యాపారం చేశారు. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు పెట్టారు. ఆర్థికంగా బలంగా ఎదిగారు. మేడ్చల్.. మల్కాజిగిరి ప్రాంతాల్లో ఆయనంత ధనవంతుడు ఎవరూ ఉండరు.
బంధువులను వదలని ఐటీ..
మల్లారెడ్డి ఆస్తులపై దాడులు చేస్తున్న ఐటీ అధికారులు ఆయన కూతురు, అల్లుడు, ఇద్దరు కొడుకులు, తమ్ముడి ఇళ్లపైన కూడా దాడులు చేస్తున్నారు. విద్యా సంస్థలు, కంపెనీలు, ఫామ్‌హౌస్‌లు, ఇతర ఆస్తులపైనా దాడులు కొనసాసగిస్తున్నారు. ఆదాయం ఎలా వచ్చింది. పన్ను సక్రమగా కడుతున్నారా.. బినామీల పేరిటి ఏమేమి ఉన్నాయి. సొంతగా ఎంత ఆస్తి ఉంది. లావాదేవీలు ఏమిటి, రాజకీయాల్లోకి రాకముంద ఉన్న ఆస్తులు ఎన్ని.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సంపాదించిన ఆస్తులు ఏమిటి ఇలా అన్ని వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. దాడుల సమయంలో ఇంట్లోనే ఉన్న మల్లారెడ్డి ఐటీ దాడులపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
నేతల్లో టెన్షన్..
మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు మొదలు కావడంతో గులాబీ నేతలు, ప్రజాప్రతినిధుల్లో టెన్షన్ మొదలైంది. ఇన్నాళ్లూ కేంద్రం ఏం చేయబొతుందో.. ఢిల్లీలో ఉన్న తన సన్నిహితుల ద్వారా ముందే తెలుసుకునే కేసీఆర్, ఇటీవల ఎమ్మెల్యేలకు ఎర ద్వారా కేంద్ర రహస్యాలు ఎలా తెలుసుకుంటున్నారో కేంద్రం గుర్తించింది. దీంతో అత్యంత పకడ్బందీగా చర్యలకు దిగుతోంది. ఐటీ అధికారులు మల్లారెడ్డి ఇంటికి వచ్చే వరకూ తెలంగాణ పోలీసులకు కానీ, ప్రభుత్వానికి కానీ సమాచారం అందలేదు. అత్యంత గోప్యంగా ఐటీ అధికారులు దాడులకు ప్లాన్ చేశారు. తెలంగాణ ఇంటలిజెన్స్ అధికారులు కూడా ఐటీ దాడుల అంశాన్ని పసిగట్టలేకపోయారు. దీంతో బడా వ్యాపారులైన టీఆర్‌ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో టెన్షన్ మొదలైంది. కేసీఆర్, బీజేపీ పంచాయతీ తమ చావుకొచ్చేలా ఉందని అధికార పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు.

కేటీఆర్, కవిత ఆస్తులపైనా ఐటీ దాడి జరిగే ఛాన్స్
తెలంగాణ ముఖ్యమైన మంత్రి, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, కేసీఆర్ తనయుడు కేటీఆర్, కేసీఆర్ కూతురు కవిత ఆస్తులపైకూడా ఐటీ దాడులు జరిగే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్, కవిత ఆస్తులపై కూడా రేవంత్‌రెడ్డి గతంలో పలుమార్లు ఐటీ, ఈడీకి ఫిర్యాదు చేశారు. ఫామ్‌హౌస్‌ల నిర్మాణం, భూ కబ్జాలు, ఇసుక దందా, డ్రగ్స్ దందా, కే టాక్స్ ఇలా అనేక అంశాలపై ఆధారాలతో రేవంత్ ఐటీ, ఈడీకి ఫిర్యాదు చేశారు. తాజాగా మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అటాక్స్ నేపథ్యంలో ఇప్పటికే ఫిర్యాదులు ఉన్న కేటీఆర్, కవిత ఇళ్లపైనా దాడులు జరుగవచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే టీఆర్‌ఎస్ నేతలు, క్యాడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశం ఉంది. మరి ఈ ఐటీ దాడులపై కేసీఆర్, కేటీఆర్, కవిత ఎలా స్పందిస్తారో, కేంద్రంపై ఎలాంటి ఆరోపణలు చేస్తారో వేచి చూడాలి.