Viral : అది అమెరికన్ మున్సిపాలిటీ కోర్ట్. కోర్టు ఆవరణ మొత్తం గంభీరంగా ఉంది. ఇంతలోనే కర్ర సహాయంతో నడుచుకుంటూ ఓ 96 సంవత్సరాల సీనియర్ సిటిజన్ వచ్చాడు. ఆయన పేరు కోలియో .. అమెరికాలో నివాసం ఉంటాడు. ఈలోగా జడ్జి వచ్చాడు. అతడు సీటులో కూర్చోగానే అసిస్టెంట్లు ఒక కేసు కు సంబంధించి ఫైలు ఆయనకు అందించారు. దానిని పరిశీలించిన ఆయన.. నిందితుడిని విచారణ చేయడం ప్రారంభించారు. ” మిస్టర్ కోలియో.. మీరు స్కూల్ జోన్ లో అతివేగంగా వాహనం నడిపినందుకు పోలీస్ శాఖ మీ మీద అభియోగాలు మోపింది. దీనికి మీరు ఏం సమాధానం చెబుతారు?” అంటూ జడ్జి ప్రశ్నించాడు. తర్వాత కోలియో ఆ కేసుకు సంబంధించి జడ్జికి వివరణ ఇచ్చాడు.
నా వయసు 96 సంవత్సరాలు
” మిస్టర్ జడ్జ్! నా వయసు 96 సంవత్సరాలు. నేను గతంలో ఎప్పుడు కూడా ఆ స్థాయిలో వాహనం నడపలేదు. కానీ ఆరోజు నడపాల్సి వచ్చింది. నేను నడుపుతున్న వాహనంలో నా కుమారుడు కూర్చుని ఉన్నాడు. అతడు దివ్యాంగుడు. పైగా అతడికి క్యాన్సర్ సోకింది. తనకు సోకిన వ్యాధికి చికిత్స చేయాలంటే వారానికి రెండు సార్లు రక్తం మార్చాలి. అలా రక్తం మార్చకపోతే అతడు కన్నుమూస్తాడు. నా కుమారుడి దుస్థితి చూడలేక వాహనాన్ని వేగంగా నడిపాను. ఆరోజు నా కుమారుడికి చికిత్స అందించే వైద్యుడిని సకాలంలో కలవాలనే వేగంగా కారు నడిపాను” అంటూ తన వివరణ ముగించాడు.
కన్నీటి పర్యంతమయ్యాడు
కోలియో తన కొడుకు గురించి చెప్పిన కథను విని జడ్జి కన్నీటి పర్యంతమయ్యాడు. ” మీరు గొప్ప మనిషి. గొప్ప విలువలు మీలో ఉన్నాయి. మీ కుమారుడికి ఏమీ కాదు. మీ కుమారుడు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ కేసు డిస్మిస్ చేస్తున్నాను” అంటూ ముగించాడు..ఇన్ స్టా గ్రామ్ లో కనిపించిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. చూసేందుకు దీని నిడివి మాత్రమే ఉన్నప్పటికీ.. ఇందులో ప్రతి సంభాషణ కూడా గుండెల్ని కదిలిస్తుంది. 96 సంవత్సరాల వయసు ఉన్న ఓ తండ్రి దివ్యాంగుడు, రక్త క్యాన్సర్ సోకిన తన కుమారుడిని బతికించుకునేందుకు పడే తాపత్రయం ఇందులో కనిపించింది. సాధారణంగా మన దేశంలోనే కుటుంబ బంధాలు బలంగా ఉంటాయి అనుకుంటాం కానీ.. అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లోనూ మానవ బంధాలు బలంగానే ఉన్నాయి. వాటిని ఈ వీడియో ప్రతిబింబించింది. ఈ వీడియో చూసిన వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. “నాన్నంటే నాన్నే. ఆయన ప్రేమను కొలిచేందుకు మన దగ్గర ఉన్న ఉపమానాలు సరిపోవు” అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
View this post on Instagram