రోజంతా ఆకలితో ఉన్నోడికి.. ప్యారడైజ్ బిర్యానీ ముందు పెట్టి.. ఒక్కో మెతుకు మాత్రమే నోట్లో వేసుకోవాలని కండీషన్ పెడితే ఎలా ఉంటుంది? ఆకలితో ఉండడంకన్నా దారుణమైన శిక్ష కదా అదీ..? శోభనం విషయంలోనూ ఇదే విధంగా కండీషన్ పెడతారు ఓ దేశంలో! ఏ దేశం.. ఏంటా కండీషన్ అంటారా..? రండి.. కలిసి చదువుకుందాం!
సముద్రం మధ్యలో ఉండే దీవి అది. సుమత్రా దీవులకు తూర్పుభాగంలో ఉంటుందీ ఐలాండ్. దీన్ని ఇప్పటి వరకూ ప్రత్యేక దేశంగా గుర్తించలేదు. ఇక్కడ సుందరమైన ప్రదేశాలు పర్యాటకులను ఎంతగానో అలరిస్తాయి. అయితే.. ఇక్కడి ప్రాంత ప్రజల్లో ఓ విచిత్రమైన ఆచారం ఉంది. ఘనంగా పెళ్లి చేస్తారు.. ధూమ్ ధామ్ గా బరాత్ నిర్వహిస్తారు. కానీ.. శోభనం దగ్గరికి వచ్చే సరికి మాత్రం కండీషన్స్ అప్లై అవుతాయి.
ఇద్దరినీ ఒకే గదిలో తోలుతారు. మూడు రోజులపాటు అందులోనే ఉండాలి. ఏమైనా చేసుకోవచ్చు. రతీమన్మథుల్లా చెలరేగిపోవచ్చు. ఆ మొగుడూ పెళ్లాల ఇష్టం. కానీ.. కండీషన్స్ అప్లై. ఒకటి వాష్ చేసుకోవడానికంటూ నీటి చుక్క కూడా ఇవ్వరు. రెండోది మూత్రం కూడా విసర్జించొద్దు. లావెట్రీకి కూడా వెళ్లడానికి వీళ్లేదు!
ఎవరూ చూడకుండా వెళ్లొచ్చుగా అంటారేమో.. బయటి నుంచి తాళం వేస్తారు. లోపల అటాచ్ లు ఉంటాయనుకుంటారేమో.. అస్సలే ఛాన్స్ లేదు. సింగిల్ రూమ్ లో మూసేస్తారు. ఇలా ఒక్క రోజు కాదు.. మూడు రోజులు ఉండాలి! మరి, అర్జంట్ అయితే అంటారేమో.. అది మీ ఖర్మ అంటారు బయటున్న పెద్దలు. చచ్చినట్టు ఆపుకోవాల్సిందే.
ఇది ఎన్నో శతాబ్దాలుగా సాగుతున్న ఆచారం అక్కడ! ఎందుకిలా అంటే.. ఇలా చేయకపోతే వధూవరుల్లో ఎవరో ఒకరు చనిపోతారని వారి మూఢ నమ్మకం. అంతేకాదు.. వారికి పుట్టే బిడ్డలు కూడా వెంటనే చనిపోతారని వారు నమ్ముతారు. ఇలా చేయడం ద్వారా ఆ దోషం పోతుందని విశ్వసిస్తారు. అందుకే.. ఈ మూడు రోజులు నవదంపతులను హింసిస్తారు. ఇలా చేయడం ద్వారా వారి మధ్య బంధం మరింతగా బలపడుతుందని కూడా వారు భావిస్తారు. ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం అంటే ఇదేనేమో!