జగన్ కు షాకిచ్చిన కేంద్రం

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. మొత్తానికి ఏపీ సీఎంజగన్ బోల్తా పడిపోయాడు. కేంద్రంతో ఎంత దోస్తీ చేస్తున్నా.. ఎన్నిసార్లు విన్నవించినా జగన్ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఒక ఏపీ కలల ప్రాజెక్ట్ నిర్మాణం అనిశ్చితిలో పడిపోయింది. పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేయడానికి కావాల్సిన మొత్తం వ్యయం రూ.55656.87 కోట్లు కాగా.. కేంద్రం మాత్రం పాత 2017 లెక్కల ప్రకారం రూ.20398.61 కోట్లకు మించి ఇచ్చేది లేదని.. చస్తే చావండి అంటూ పోలవరం నిర్మాణాన్ని గాలికి వదిలేసింది. దీంతో ఏపీకి […]

Written By: NARESH, Updated On : March 21, 2021 11:51 am
Follow us on

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. మొత్తానికి ఏపీ సీఎంజగన్ బోల్తా పడిపోయాడు. కేంద్రంతో ఎంత దోస్తీ చేస్తున్నా.. ఎన్నిసార్లు విన్నవించినా జగన్ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఒక ఏపీ కలల ప్రాజెక్ట్ నిర్మాణం అనిశ్చితిలో పడిపోయింది.

పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేయడానికి కావాల్సిన మొత్తం వ్యయం రూ.55656.87 కోట్లు కాగా.. కేంద్రం మాత్రం పాత 2017 లెక్కల ప్రకారం రూ.20398.61 కోట్లకు మించి ఇచ్చేది లేదని.. చస్తే చావండి అంటూ పోలవరం నిర్మాణాన్ని గాలికి వదిలేసింది. దీంతో ఏపీకి సాగు, తాగునీటిని అందించే అతి పెద్ద ప్రాజెక్టు పోలవరం నిర్మాణం ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది.

అసలే అప్పుల్లో ఉండి.. అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్ కు ఇప్పుడు పోలవరం విషయంలో కేంద్రం ఇచ్చిన ట్విస్ట్ తో ఇప్పుడు దాని నిర్మాణం ఏపీ సర్కార్ కు గుదిబండ కానుంది. పథకాలే నడిపించలేని జగన్ సర్కార్ కు ఇప్పుడు ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తుందనేది చూడాలి.

నిజానికి పోలవరం అంచనా వ్యయం పెరగడానికి.. కేంద్రం నో చెప్పడానికి చంద్రబాబే కారణమని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. విభజన హామీ ప్రకారం కేంద్రం పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్ట్ ను 2014లో చంద్రబాబులు గెలవగానే ఈ ప్రాజెక్టును రాష్ట్రం నిర్మిస్తుందని మోడీని ఒప్పించి తీసుకున్నాడు. ఐదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే జగన్ సర్కార్ కు ఈ బాధ ఉండేది కాదు. కానీ ఆయన పోలవరంను ఓ ఏటీఎంలా వాడేసి కేంద్రం నిధులు మింగేశాడన్నది వైసీపీ ఆరోపణ.. ఇప్పుడు ఆ జాప్యంతోనే 30వేల కోట్లలోపు పూర్తయ్యే ప్రాజెక్టు 55వేలకు పెరిగింది. కేంద్రానికి గుదిబండగా మారి వదిలేసే పరిస్థితికి వచ్చింది. ఆ భారం జగన్ సర్కార్ పై పడింది.. మరి జగన్ సర్కార్ ఏం చేస్తుందనేది వేచిచూడాలి.