Prabhas: టాలీవుడ్ లో ప్రభాస్ ను మించిన హీరో లేరా? ఈ లెక్కలే సాక్షమా?

లాంగ్ రన్ లో సాలిడ్ కలెక్షన్లు సాధించిన సినిమాలు కూడా కోకొల్లాలు. కానీ ఆంధ్రాలో ఈ పరిస్థితి లేదనేది వాస్తవం. ఇక నైజాంలో కలెక్షన్ కింగ్ ఎవరంటే ముందుగా అందరూ చెప్పే పేరు డార్లింగ్ ప్రభాస్. ఈయనే కింగ్ ఇక్కడ.

Written By: Suresh, Updated On : January 6, 2024 3:01 pm

Prabhas

Follow us on

Prabhas: ఒకప్పుడు వంద రోజులు ఆడేవి సినిమాలు. కానీ ప్రస్తుతం వారం, పది రోజులకే పరిమితం అవుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ఎక్కువ రోజులు ఆడుతున్నాయి. అయితే థియేటర్స్ లో సినిమా వస్తుందంటే ఒకప్పుడు పండుగలా భావించేవారు. కానీ ప్రస్తుతం కామన్ గా మారింది. అయితే థియేటర్స్ పరంగా చూసుకుంటే ఆంధ్రాలో కంటే నైజాంలో తక్కువే. తెలంగాణ మొత్తం నైజాం ఏరియాగా వస్తుంది. కానీ కలెక్షన్ల పరంగా చూసుకుంటే ఆంధ్రా కంటే నైజాంలోనే ఎక్కువ వస్తుంటాయి. నైజాం ప్రజలకే సినిమాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందంటారు కొందరు.

లాంగ్ రన్ లో సాలిడ్ కలెక్షన్లు సాధించిన సినిమాలు కూడా కోకొల్లాలు. కానీ ఆంధ్రాలో ఈ పరిస్థితి లేదనేది వాస్తవం. ఇక నైజాంలో కలెక్షన్ కింగ్ ఎవరంటే ముందుగా అందరూ చెప్పే పేరు డార్లింగ్ ప్రభాస్. ఈయనే కింగ్ ఇక్కడ. ఎందుకంటే ఈయన హీరోగా నటించిన నాలుగు సినిమాలు నైజాంలో సాలిడ్ గా రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లు సొంతం చేసుకున్నాయి. గ్రాస్, షేర్ ఏ లెక్కలు చూసుకున్నా కూడా నైజాంలో ప్రభాస్ ఎక్కువ సాధించారు. ఇక నైజాంలో వంద కోట్ల కలెక్షన్లు రాబట్టిన సినిమాలంటే ఆర్ఆర్ఆర్, బాహుబలి2, సలార్. ఇందులో రెండు సినిమాలు కూడా ప్రభాస్ వే అవడం గమనార్హం.

70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాను చూస్తే మొదటగా కేజీఎఫ్ చాప్టర్ 2 ఉంటుంది. దీని తర్వాత బాహుబలి 1 నిలిచింది. అంతేకాదు అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా కూడా నిలిచింది. ఈ సినిమా కంటే నైజాంలో పుష్పకి కలెక్షన్లు తక్కువ వచ్చాయట. ఈ సినిమా 70 కోట్ల కలెక్షన్లను క్రాస్ చేయలేకపోయింది. అందుకే ఈ సినిమా కేవలం 60 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది. ఇక మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా 60 కోట్ల గ్రాస్ ను మాత్రమే క్రాస్ చేసింది.

వాల్తేరు వీరయ్య, ఆదిపురుష్ సినిమాలు కూడా 60 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి. అందుకే ప్రభాస్ అత్యధిక సార్లు నైజాంలో 60 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన హీరోగా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. అంతేకాదు ఈయన హీరోగా రాబోతున్న మరిన్ని సినిమాలు కూడా ఇంతకు మించి అనేలా ఉంటాయనే టాక్ నడుస్తోంది. మరి చూడాలి ముందు ముందు వచ్చే సినిమాలు ప్రభాస్ కు ఎలాంటి రేంజ్ ను సంపాదించి పెడుతాయో..