https://oktelugu.com/

Star Heroes- Star Directers : తెలుగు, తమిళంలో దర్శకులుగా సత్తా చాటుకున్న స్టార్ హీరోలు వీళ్లే…

మొదట సూపర్ హిట్ సినిమాలను తీసి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పేరు సంపాదించుకున్న సీనియర్ ఎన్టీయార్. ఆ తర్వాత కొన్ని సినిమాలకి తనే డైరెక్షన్ చేశాడు. అందులో 'దాన వీర శూర కర్ణ' ఒకటి. అయితే ఈ సినిమాని మొదట వేరే దర్శకుడు చేత చేయించాలని అనుకున్నప్పటికీ, ఆ దర్శకుడు హ్యాండ్ ఇవ్వడంతో ఎన్టీఆర్ ఈ సినిమాని తనే స్వయం గా డైరెక్షన్ చేశాడు. ఇక ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది

Written By:
  • Gopi
  • , Updated On : July 17, 2024 / 08:48 PM IST
    Follow us on

    Star Heroes- Star Directers :  సినిమా ఇండస్ట్రీలో హీరోలు దర్శకులుగా మారి సినిమాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక స్టార్ డమ్ వచ్చిన తర్వాత వాళ్ల సినిమాలను వాళ్లే డైరెక్షన్ చేసుకొని సూపర్ సక్సెస్ లను అందుకున్నారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు, తమిళ భాషల్లో వాళ్లే స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించిన హీరోలు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    ఎన్టీయార్

    మొదట సూపర్ హిట్ సినిమాలను తీసి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పేరు సంపాదించుకున్న సీనియర్ ఎన్టీయార్. ఆ తర్వాత కొన్ని సినిమాలకి తనే డైరెక్షన్ చేశాడు. అందులో ‘దాన వీర శూర కర్ణ’ ఒకటి. అయితే ఈ సినిమాని మొదట వేరే దర్శకుడు చేత చేయించాలని అనుకున్నప్పటికీ, ఆ దర్శకుడు హ్యాండ్ ఇవ్వడంతో ఎన్టీఆర్ ఈ సినిమాని తనే స్వయం గా డైరెక్షన్ చేశాడు. ఇక ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది…

    కృష్ణ

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ మంచి పేరు ను సంపాదించుకున్న హీరో కృష్ణ…ఈయన వరుస సినిమాలతో ఇండస్ట్రీ మీద దండయాత్ర చేశాడు. ఇక ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో ఇండస్ట్రీ కి ఏ టెక్నాలజీ రావాలన్నా కూడా అది కృష్ణ ద్వారానే సాధ్యమవుతుంది అనేంతలా ఒకప్పుడు మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మొదటి కలర్ సినిమాని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అలాగే మొదటి కౌబాయ్ సినిమాను కూడా తనే చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన హీరోగా స్వీయ దర్శకత్వంలో ‘సింహాసనం ‘ అనే సినిమా తీశాడు..ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా కృష్ణకి అటు హీరోగా, ఇటు డైరెక్టర్ గా మంచి గుర్తింపుని తీసుకొచ్చి పెట్టింది…

    కమల్ హాసన్

    తమిళ్ సినిమా ఇండస్ట్రీలో లోకనాయకుడిగా పేరు సంపాదించుకున్న కమల్ హాసన్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా అందరికీ సుపరిచితమే. ఈయన తెలుగులో కూడా చాలా సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ఇక అలాంటి కమల్ హాసన్ విశ్వరూపం సినిమాతో దర్శకుడుగా పరిచయమై మంచి సక్సెస్ అయితే అందుకున్నాడు. ఇక ఆ తర్వాత చేసిన విశ్వరూపం 2 సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించనప్పటికీ విశ్వరూపంతో మాత్రం ఆయన ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అయితే దక్కించుకున్నాడు…