Tollywood – Bollywood : బాలీవుడ్ లో మాదిరిగా టాలీవుడ్ లో కూడా మాఫియా ఉందా..?

కాబట్టి బాలీవుడ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా తేడా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఇక ఇంతకుముందు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉందో తెలియదు గానీ, ప్రస్తుతం అయితే ఇండస్ట్రీ లో ఎలాంటి మాఫియా లేదు ఇక్కడ ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్లే పైకి ఎదుగుతారు అనేది మాత్రం వాస్తవం...

Written By: Gopi, Updated On : February 3, 2024 8:36 am
Follow us on

Tollywood – Bollywood : సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి స్టార్లుగా పాతుకుపోయిన హీరోలు కొత్త హీరోలని పైకి ఎదగనివ్వరు అంటూ చాలా రోజులుగా రూమ్మలైతే వినిపిస్తూ ఉంటాయి. ఇక ఈ క్రమంలోనే స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లు అందరూ కలిసి ఒక మాఫియాగా మారి కొత్తగా వచ్చిన హీరోలనుగాని, హీరోయిన్లను గాని ఎదగకుండా చేయడం మనం బాలీవుడ్ లో చూస్తున్నాం.

ఇక బాలీవుడ్ లో మాదిరిగానే టాలీవుడ్ లో కూడా అలాంటి మాఫియా ఉందా అని చాలామందికి డౌట్ అయితే ఉంది. కానీ టాలీవుడ్ లో అలాంటి మాఫియా లేదనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది యంగ్ హీరోలు కూడా ఇప్పుడు టాప్ హీరోలుగా ఎదిగిపోతున్నారు. ఉదాహరణకి విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరో ఏ బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా వచ్చి ఒకటి, రెండు సినిమాలతోనే టాప్ హీరో రేంజ్ కి వెళ్లిపోయాడు. ఇక ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు ప్లాప్ అవడం వల్ల ఆయన క్రేజ్ కొంచెం తగ్గింది కానీ, లేదంటే టాప్ హీరోగా ఎదిగేవాడు. కాబట్టి మన ఇండస్ట్రీలో యంగ్ హీరోలను తొక్కేసే పని అయితే జరగడం లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్లే స్టార్ హీరోలుగా ఎదుగుతున్నారు. అలాగే కొంతమంది స్టార్ హీరోల కొడుకులు కూడా సక్సెస్ ఫుల్ హీరోలుగా మారలేకపోతున్నారు.

కాబట్టి ఇక్కడ కావాల్సింది టాలెంట్ మాత్రమే అనేది స్పష్టం గా తెలుస్తుంది. ఇక తెలుగు ప్రేక్షకులు కూడా ఎవరైతే వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ మంచి సినిమాలు చేస్తున్నారో వాళ్లకి సక్సెస్ లను కట్టబెట్టి వాళ్లను స్టార్లను చేస్తున్నారు. వాళ్ళు కొత్త హీరోలైనా కూడా స్టార్లుగా వెలుగొందుతున్నారు. ఆల్రెడీ స్టార్ హీరోల కొడుకులు చేసిన సినిమాలు బాగా లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు.

కాబట్టి బాలీవుడ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా తేడా ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఇక ఇంతకుముందు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉందో తెలియదు గానీ, ప్రస్తుతం అయితే ఇండస్ట్రీ లో ఎలాంటి మాఫియా లేదు ఇక్కడ ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్లే పైకి ఎదుగుతారు అనేది మాత్రం వాస్తవం…