Jr NTR vs TDP: జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ట్వీట్ పై చంద్రబాబు, టీడీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నారు. ఏపీలోని ‘హెల్త్ యూనివర్సిటీ’ పేరును వైఎస్ జగన్ సర్కార్ మార్చడం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ‘ఎన్టీఆర్’ పేరు తీసేసి.. ‘వైఎస్ఆర్’ పేరు పెట్టడమే వివాదాస్పదమైంది.

ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ ‘ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు. ఎన్టీఆర్ స్తాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్తాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు’ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. రాజకీయాలను పక్కనపెడితే చాలా హుందాగా ఎన్టీఆర్ స్పందించారు. అయితే ఇందులో ఎన్టీఆర్ తో సమానంగా వైఎస్ఆర్ ను గుర్తించడమే తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోకుండా ఉంది.
ఇక తన తాత పేరును తొలగించడంపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించాడు. ఈ వివాదంలో తలదూర్చాడు. ఎన్టీఆర్ నట వారసుడిగా సీరియస్ గా రియాక్ట్ అవుతాడని అంతా భావించినా.. ఎన్టీఆర్ మాత్రం ‘కర్ర విరగకుండా.. పాము చావకుండా’ సమతూకం పాటిస్తూ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ వారసుడిగా ఆయనను కీర్తించాల్సింది పోయి.. ప్రత్యర్థి వైఎస్ఆర్ ను కూడా గౌరవిస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేయడమే తెలుగు తమ్ముళ్ల పుండుమీద కారం చల్లినట్టు అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ పై తెలుగు తమ్ముళ్లు రగిలిపోవడానికి కారణమైంది..
ఎన్టీఆర్ హుందాగా స్పందించారని కొందరు అంటే.. వ్యతిరేక, టీడీపీ వర్గం వాళ్లు మాత్రం తప్పుపడుతున్నారు. ఈక్రమంలో ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.