YSR cheyutha scheme : పేద అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ చేయూత కింద ముఖ్యమంత్రి జగన్ సాయాన్ని అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా బటన్ నొక్కి 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,949.44 కోట్ల ఆర్థిక సాయాన్ని కుప్పం నుంచి నేరుగా సీఎం జగన్ జమ చేశారు.

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు సాయాన్ని అందిస్తున్నారు. కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా బాపూజీ కళామందిర్ నుంచి ముఖ్య అతిథిగా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, విశిష్ట అతిథిగా సీనియర్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్, ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్, మాజీ కేంద్రమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, పలు బీసీ కార్పొరేషన్ చైర్ పర్సన్లు మామిడి శ్రీకాంత్, అందవరపు సూరిబాబు, బల్లాడ హేమమాలిని రెడ్డి, కోరాడ ఆశాలత గుప్తా, చీపురు రాణి, రాజాపు హైమావతి, డీసీఎంఎస్ చైర్పర్సన్ సల్లా సుగుణ, డిఆర్డిఏ పీడీ డాక్టర్ డి. విద్యా సాగర్ తదితరులు..
చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ కీలక ప్రకటన చేశారు. జనవరి నెల నుంచి పించన్లను రూ.2,750కి పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా పించన్ విలువను ఇదివరకే చెప్పినట్లుగా రూ.3 వేలకు పెంచుతామని కూడా జగన్ ప్రకటించారు.
ప్రస్తుతం ఏపీలో వివిధ వర్గాలకు చెందిన వారికి పించన్ గా రూ.2,500 అందిస్తున్న సంగతి తెలిసిందే. కుప్పం పర్యటనలో భాగంగా వైఎస్సార్ చేయూత కింద మూడో విడత నిధులను విడుదల చేసిన జగన్ తమ ప్రభుత్వం మహిళల ప్రభుత్వమని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో మహిళల జీవితాల్లో మార్పు కనిపిస్తోందని ఆయన అన్నారు. అమ్మ ఒడి ద్వారా అక్కా చెల్లెమ్మలకు అండగా నిలబడ్డామన్నారు. గడచిన మూడేళ్లలోనే మహిళలకు రూ.1.17 లక్షల కోట్లను పంపిణీ చేశామన్నారు. తమ ప్రభుత్వ పథకాల అమలులో లంచాలు లేవని, మధ్యవర్తులు లేరని, వివక్ష అసలే లేదని ఆయన వ్యాఖ్యానించారు.
చిత్తూరుజిల్లా కుప్పంలో వైయస్సార్ చేయూత కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్. రాష్ట్రవ్యాప్తంగా 26,39,703 మంది అక్క చెల్లెమ్మలకు రూ.4,949.44 కోట్లు పంపిణీ. మూడో దఫాతో కలుపుకుని ఒక్క చేయూత కింద రూ. 14,110.62 కోట్లు పంపిణీ చేశామన్న సీఎం. #YSRCheyutha pic.twitter.com/gHdjrnNta5
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 23, 2022