NTR Health University Row: చరిత్ర ఎప్పుడూ ఏం దాచదు.. చరిత్రలో హీరోలు ఎవరు.? విలన్లు ఎవరు అన్నది రక్తంతో లిఖిస్తుంది. అదెప్పటికీ చెరిగిపోదు. ఇప్పుడు ‘మెడికల్ యూనివర్సిటీకి’ ఎన్టీఆర్ పేరు తొలగించగానే బట్టలు చింపుకుంటున్న చంద్రబాబు అండ్ కోలు.. నిజానికి.. ఎన్టీఆర్ ను చివరి నిమిషాల్లో ఎంత క్షోభ పెట్టారు? ఆయనను సీఎం కుర్చీ నుంచి దించి మానసిక క్షోభకు గురిచేసి మరణానికి దారితీశారన్నది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఇప్పుడు వారే ‘ఎన్టీఆర్ కోసం మొసలికన్నీరు’ కార్చడమే అందరినీ విడ్డూరంగా కనిపిస్తోంది. మరి ఈ విషయంలో మెడికల్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చిన జగన్ రెడ్డి నేరస్తుడా? ముఖ్యమంత్రి పదవి లాక్కొని రాళ్ళతో చెప్పులతో కొట్టి వెన్నపోటు పొడిచి ఎన్టీఆర్ చావుకు కారకుడైన చంద్రబాబు నేరస్తుడా? అని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు.

మెడికల్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయడాన్ని ఎవరూ హర్షించడం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కంటే కూడా ఎన్టీఆర్ సీనియర్.. తెలుగు రాష్ట్రాల్లో మంచి ముద్ర వేశాడు. వైఎస్ఆర్ ఆరేళ్లు మాత్రమే సీఎంగా చేశారు. కొన్ని సంక్షేమపథకాలు పెట్టారు. కానీ తెలుగు రాష్ట్రాలకు రెండు మూడు సార్లు సీఎం అయిన ఘనత ఎన్టీఆర్ సొంతం. విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి పేదలకు రూ.2 లకే రేషన్ ఇచ్చాడు. ఢిల్లీ గడ్డపై తెలుగు వారి సత్తాను నిరూపించారు. తెలుగువారికి గుర్తింపు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ సొంతం.

అయితే అలాంటి ఎన్టీఆర్ ను సీఎం కుర్చీలోంచి దించేసి చంద్రబాబు టీడీపీని లాక్కొని ఆయనకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన తీరును ఎవరూ మర్చిపోరు. టీడీపీ నుండి ఎన్టీఆర్ ను బహిష్కరించారు. సీఎం గా పనికిరాడని చెప్పులు, కోడిగుడ్లతో కొట్టించారు. సీఎం పదవి నుండి గెంటేశారు. ఇప్పుడాయన పేరును తీసేశారని టీడీపీ వారు పోరాడుతున్నారు. అదొక వాస్తవం. కానీ ఇప్పుడు అదే చంద్రబాబు మెడికల్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేస్తే గాయి చేస్తున్నాడు. అందుకే చంద్రబాబు మాటలను ఎవరూ కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. కొందరు కమ్మ నేతలు, కమ్మ పారిశ్రామికవేత్తలు, కమ్మ మీడియా తప్పితే ఈ లొల్లిని ఎవరూ పట్టించుకోవడం లేదు.. రచ్చ చేయడం లేదు.

ఎవరు చేసుకున్న ఖర్మ వారు అనుభవించక తప్పదని పెద్దల మాట.! అదే ఇప్పుడు అక్షరాల నిజం అవుతోంది. జీవితం చివరి కాలంలో నటుడు సీనియర్ ఎన్టీఆర్ అనుభవించిన నీచనికృష్ట జీవితం లాంటిది మరెవ్వరికీ రాకూడదు! సీఎంగా దించేయొచ్చుగానీ చెప్పులతో కొట్టించడం మరీ దారుణమైన చర్య.! ఇప్పుడు ఆ పనిచేసిన అవమానం కంటే జగన్ చేసిన పని చాలా చిన్నది. అయినా ఎన్టీఆర్ పేరు తీసేసినంత మాత్రాన ఆయన ఖ్యాతి తెలుగు ప్రజల గుండెల్లో చెరిగిపోదు. కానీ ఆయన కోసం టీడీపీ పోరాడుతుండడమే అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. చంద్రబాబు గగ్గోలు విస్తుపోయేలా చేస్తోంది.