Nellore Husband And Wife: పెద్దలు కుదిర్చన వివాహంతో ఒక్కటైన జంట మధ్య భార్య మాజీ ప్రియుడి జ్ఞాపకాలు ఆమె మర్చిపోలేకపోతుంది. భర్త పక్కనే ఉన్నా.. తాను మాత్రం ప్రియుడి ఊహల్లోనే ఉంటుంది. దీనిని గుర్తించిన భర్త.. చివరకు భార్య ప్రియుడి గురించి తెలుసుకుంటాడు. ఆయను తీసుకువచ్చి భార్యకు ఇచ్చి పెళ్లిచేస్తాడు. ఇది..1998లో వచ్చిన కన్యాదానం సినిమా కథ. అచ్చం ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో జరిగింది. కాకపోతే అక్కడ భర్త భార్యకు పెళ్లిచేస్తే ఇక్కడ భార్య భర్తకు ప్రియురాలితో వివాహం జరిపించింది.

ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది. కానీ, ఆ అబ్బాయి తనకంటే ముందు మరో అమ్మాయిని ప్రేమించాడని తెలుసుకొని వారిద్దరికీ దగ్గరుండి పెళ్లి చేసింది. అయితే మొదటి భార్య అతడితో విడిపోకుండానే రెండో పెళ్లి చేయడం గమనార్హం. ముగ్గురూ కలిసి ఎంచక్కా ఒకే ఇంట్లో ఉండి గుట్టుగా కాపురం చేసుకుంటారట.
విచిత్ర ప్రేమకథా చిత్రమ్..
నెల్లూరు జిల్లా డక్కిలి అంబేద్కర్ నగర్ కు చెందిన కల్యాణ్‌కు ఇటీవలే విమల అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరిద్దరికీ టిక్‌టాక్ ద్వారా పరిచయం ఏర్పడగా. కొంత కాలానికి ప్రేమికులయ్యారు. ఆ తర్వాత భార్యాభర్తలు అయ్యారు. అంతా బాగుందనుకున్న సమయంలో ఇతగాడి మొదటి లవర్ నిత్యశ్రీ ఎంట్రి ఇచ్చింది. గతంలో కల్యాణ్ తాను ప్రేమించుకున్నామని, అయితే పెద్దల కారణంగా తాము విడిపోయామని వివరించింది. ఇన్నాళ్లూ అతడే వస్తాడనుకొని పెళ్లి కూడా చేసుకోలేదని చెప్పింది. తనకు న్యాయం చేయాలని మొదటి భార్య విమల వద్ద కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో కరిగిపోయిన విమల మీప్రేమ నిజమైంది నీకిష్టమైతే ఆయన్ను రెండో పెళ్లి చేస్కో.. ముగ్గురం కలిసే ఉందామని వివరించింది. అందుకు నిత్యశ్రీ ఓకే చెప్పడం, భర్త కల్యాణ్ కూడా సరే అన్నాడు.

గుడిలో కల్యాణం..
అందరికీ నచ్చడంతో ఈ విషయానిన విమల, కల్యాణ్ కుటుంబ సభ్యులకు కూడా చెప్పారు. వారు అభ్యంతరం చెప్పడంతో విమల సాటి మహిళకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పెళ్లి చేయాలని నిర్ణయించింది. గ్రామంలోని ఆలయానికి వెళ్లి అర్చకుడితో మాట్లాడింది. పెళ్లికి అవసరమైన సామగ్రి తెప్పించింది. అర్చకుడు చెప్పిన ముహూర్తానికి ఆలయంలోనే ఇద్దరికీ పెళ్లి చేసింది. మరి చూడాలి ముగ్గురు ఎన్నాళ్లు కలిసి ఉంటారో..