Homeఆంధ్రప్రదేశ్‌National surveys: సర్వేల ఘోష: వైసీపీని ఓడించడం సాధ్యమవుతుందా? కాదా?

National surveys: సర్వేల ఘోష: వైసీపీని ఓడించడం సాధ్యమవుతుందా? కాదా?

National surveys ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. జాతీయ అగ్ర మీడియా చానెళ్లన్నీ ఈ పాయింట్ పట్టుకొని తెగ సర్వేలు చేసేస్తున్నాయి. కొత్తదనం ఏమీ లేదు. ఎందుకంటే కేంద్రంలో మోడీని కొట్టే మగాడు ఎవరూ లేడని తేలుతోంది. ఏ నెలలో.. ఏ సంవత్సరంలో చేసినా కూడా ప్రధానిగా మోడీ.. పార్టీగా బీజేపీ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. దేశంలో బీజేపీ రావడం పక్కా.. కాంగ్రెస్ కోలుకోవడం కష్టమేనని తేలిపోయింది. ఇక ప్రధానిగా మోడీకి, రాహుల్ కు మధ్య చాలా తేడా ఉంది. మోడీని అందుకోవడం రాహుల్ వల్ల కావడం లేదని తేలింది.

జాతీయ రాజకీయాలను పక్కనపెడితే తెలుగు రాజకీయాలే కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి. ఇంకా సంవత్సరన్నర టైం ఉన్న ఏపీ రాజకీయాల్లో గత నెల చేసిన సర్వేకీ.. ఈ నెల చేసిన సర్వేకి అధికార వైసీపీకి ఎంపీ సీట్లు తగ్గాయి. దీంతో ఏడాదిన్నరలో ఏమైనా జరగొచ్చు.. గుర్రం ఎగురావచ్చు అని అర్థమవుతోంది.

వ్యతిరేకత అన్న చాపకింద నీరులా ఉంటుంది. ఉప ఎన్నికల్లో అభివృద్ధి కోసం అధికార పార్టీకే జనం ఓటేస్తారు. కానీ సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి ఎన్ని కోట్లు కుమ్మరించినా సరే తమకు కావాల్సిన పార్టీకే ఓటేస్తారు. గత ఎన్నికల వేళ ‘పసుపు-కుంకుమ’ పేరిట చంద్రబాబు ప్రతీ ఇంటికి రూ.10వేలు పంచిపెట్టినా జగన్ నే గెలిపించారు. ఈసారి కూడా అదే జరగబోతోందని తెలుస్తోంది.

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతానికి వైసీపీని కొట్టే పార్టీ లేదు. అయితే ఇప్పుడే రాజకీయం మొదలవబోతోంది. చంద్రబాబు యాక్టివ్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ యాత్రకు రెడీ అవుతున్నారు. వైసీపీపై వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతోంది. 2024లో ఏదైనా జరగొచ్చు అని అర్థమవుతోంది. అందుకే కొద్దిరోజుల వ్యవధిలోనే చేసిన సర్వేలో జగన్ కు ఎంపీ సీట్లు తగ్గడం ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

* టైమ్స్ నౌ సర్వే ప్రకారం..
-రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార వైసీపీ గెలుస్తుందని టైమ్స్ నౌ ఆగస్టు 15 సందర్భంగా సర్వే చేసి నివేదిక విడుదల చేసింది. జగన్ పాలన 40 నెలలు అయినా వైసీపీపై ప్రజల్లో ఆదరణ తగ్గలేదని తెలిపింది. టౌమ్స్ నౌ ప్రకారం.. వైసీపీకి దాదాపు 17 సీట్లు.. గరిష్టంగా 23 వరకూ రావచ్చు అని తెలిపింది. ఇక టీడీపీ 3-8 ఎంపీ సీట్లు గెలవచ్చని తెలిపింది. జనసేనకు సున్నా సీట్లు అని పేర్కొంది.

-ఇటీవల ఇండియా టీవీ ఏం చెప్పిందంటే?
ఇటీవలే ఇండియా టీవీ సర్వేలో వైసీపీకి 19 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపింది. టీడీపీకి 6 సీట్లు వస్తాయని తెలిపింది. ఇండియా టుడే-సీఓటర్ సర్వేలో వైసీపీకి 18 ఎంపీ సీట్లు వస్తాయని అన్నది.

ఈ మూడు సర్వేలు చూస్తే కొద్దిరోజుల వ్యవధిలోనే 19 ఎంపీ సీట్ల నుంచి వైసీపీకి 17 ఎంపీ సీట్లకు తగ్గిపోయింది. అంటే వైసీపీ బలం తగ్గిపోయినట్టే. వచ్చే ఏడాదిన్నరలో పవన్ కళ్యాణ్ యాత్ర.. చంద్రబాబు ప్రజల్లోకి వెళితే ఏమైనా జరగవచ్చు. ప్రస్తుతం వారు యాక్టివ్ గా లేకపోవడంతో వైసీపీకి మెజార్టీ వస్తుందని చెబుతున్నారు. చివరి ఏడాదిలో ఏదైనా జరుగవచ్చని అర్థమవుతోంది.

జగన్ తనకు 175 సీట్లు వస్తాయని అంటున్నారు. కానీ ఈ సర్వేలు చూస్తే 120-130 అసెంబ్లీ స్థానాలు మాత్రమే నెగ్గే అవకాశం ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల వరకూ ఈ సంఖ్య బాగా తగ్గే అవకాశం ఉంటుంది.

ఓవరాల్ గా చూస్తే వైసీపీ బలం రోజురోజుకు తగ్గుతోంది. పవన్, చంద్రబాబులు ప్రజల్లోకి వెళ్లి గట్టిగా నిలబడితే ప్రభుత్వ వ్యతిరేకత అన్నది వీరికి ఓటు బ్యాంకుగా మారుతుంది. దానికి ఈ ఇద్దరూ పాటుపడాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పాలిటిక్స్ తగ్గించేసి ఈ ఏడాదిన్నర ప్రజల్లో ఉంటే మెరుగైన ఫలితాలు సాధించగలడు. ఇన్నాళ్లు పొత్తుల్లేకుండానే సొంతంగా అధికారంలోకి వస్తాననుకొని పవన్ ను కాలదన్నిన చంద్రబాబు ఇప్పటికైనా తన బలం బలంగా చూసుకొని జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకొని వెళ్లడం తప్ప మరో ఆప్షన్ లేదు. చంద్రబాబు ఈ పని ఎలాగైనా వచ్చే ఎన్నికల వరకూ చేస్తారు. ఆయన అధికారం కోసం ఎవరికాళ్లు అయినా పట్టుకునే నైజం కలవారని అంటరాు.

ప్రస్తుతానికి జాతీయ సర్వేలన్నీ వైసీపీదే అధికారం అంటున్నా సరే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఈసారి జనసేన, టీడీపీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.  చాలా మంది ఒక్క చాన్స్ అంటున్న పవన్ కు.. జగన్ కంటే చంద్రబాబు బెటర్ అని ఓపెన్ గానే చెబుతున్నారు. జగన్ పాలనలో ధరాఘాతం పెరిగిందని.. తమకు డబ్బులిచ్చి అంతా తీసేసుకుంటున్న చందంగా మారిందని వాపోతున్నారు. ఈ వ్యతిరేకతను జనసేన, టీడీపీలు ఏ మేరకు క్యాష్ చేసుకుంటాయన్న దానిపైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. కొద్దిరోజుల్లోనే వైసీపీ ఎంపీ సీట్లు తగ్గినదాన్ని బట్టి చూస్తే గట్టిగా పోరాడితే వైసీపీని ఓడించడం పెద్ద అసాధ్యం కాదని అర్థమవుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular