Molathadu: మొలతాడు కట్టుకుంటేనే మొగోడు.. వడ్డాణం పెట్టుకుంటేనే ఆడది అని చెప్పేవారు పూర్వం. హిందూ ధర్మ శాస్ర్తంలో మొలతాడు ప్రాధాన్యత ఉంటుంది. సనాతన ధర్మం ప్రకారం మొలతాడు కట్టుకుంటే మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. మన పూర్వీకులు మనకు ఆపాదించిన ఆచార వ్యవహారాల్లో సైన్స్ కూడా దాగి ఉండటం తెలిసిందే. ప్రతి వారు పుట్టుక తరువాత మొలతాడు కట్టుకోవాల్సిందే. మొలతాడు లేకపోతే మొగోడు కాదని వాదిస్తున్నారు. మొలతాడు కట్టుకున్నట్లయితే కొన్ని శారీరక సమస్యలు కూడా రావని తెలుస్తోంది.

మొలతాడు మన శరీరాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. మొలతాడు మీది భాగాన్ని దేవతా స్థానమని కింది స్థానాన్ని రాక్షస స్థానమని చెబుతారు. పూర్వం రోజుల్లో పంచె కట్టుకునే వారు. అది జారిపోకుండా ఉండేందుకు మొలతాడు పంచెపై ఉంచుకుని జారిపోకుండా ఉంచుకునేవారు. మహిళలైతే వడ్డాణం పెట్టుకుని చీర కట్టుకునే వారు. ఇలా మన పురాతన సంప్రదాయం ప్రకారం మొలతాడు, వడ్డాణం ప్రముఖ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాలంలో బెల్టులు వచ్చాయి. దీంతో మొలతాడుకు పనిలేకుండా పోతోంది.
Also Read: Rajendra Prasad- Senior NTR: సీనియర్ ఎన్టీఆర్ కు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పిన సినిమా ఏదో తెలుసా?
శాస్త్రప్రకారంగా చూసుకున్నా మొలతాడుతో ఎన్నో లాభాలున్నట్లు తెలుస్తోంది. మొలతాడుతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కండరాలు గట్టిపడతాయి. హెర్నియా వంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది. దీంతో మూత్రపిండాల పనితీరు కూడా బాగుంటుందని తెలుస్తోంది. అందుకే మొలతాడు కట్టుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే. మొలతాడు కట్టుకుంటే సనాతన సంప్రదాయం ప్రకారం మేలు కలుగుతుంది. మొలతాడు కట్టుకోవడంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే.

మొలతాడు నలుపు, ఎరుపు రంగులను మాత్రమే వాడుకోవాలి. డబ్బున్న వారు బంగారం, వెండి లోహాలతో కూడా కట్టుకుంటారు. ఇది కట్టుకోవడానికి కూడా మంచి రోజులు చూసుకోవాల్సిందే. బుధ, ఆదివారాల్లో మాత్రమే కట్టుకోవాలి. మంగళ, శుక్ర వారాల్లో కట్టుకోకూడదు. పాత మొలతాడు తొలగించాకే కొత్త మొలతాడు కట్టుకోవాలి. మన ఆచార వ్యవహారాల్లో మొలతాడు ప్రాధాన్యం ఎంతగానో ఉందని తెలుస్తోంది. మనం ఎప్పుడు కూడా మొలతాడు లేకుండా ఉండకూడదు. అది కట్టుకుంటేనే మనకు అన్ని లాభాలు కలుగుతాయని చెబుతున్నారు.
Also Read:Ram Column: ఆంధ్ర రాజకీయాల్లో జగన్ ప్రభావం ఎందుకు తగ్గటం లేదు?