https://oktelugu.com/

5జీ నెట్ వర్క్ తో మానవాళికి ప్రమాదమా?

సాంకేతిక నైపుణ్యతతో పక్షి జాతులు అంతరిస్తున్నాయి. ప్రపంచ మానవాళికే ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. అయినా మన దేశం పట్టించుకోవడం లేదు. ఫలితంగా దుష్ఫలితాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఇండియాలో అతి త్వరలో 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి రానుంది. దీంతో 5జీ నెట్ వర్క్ చుట్టూ కొన్ని రోజులుగా ఓ వివాదం రగులుతోంది. భారత్ లో 5జీ టెక్నాలజీ ట్రయల్ రన్ చేయడం వల్లే కరోనా సెకండ్ వేవ్ వ్యాపించిందని పుకార్లు వ్యాపించాయి. ఇందులో ఏ […]

Written By: , Updated On : June 7, 2021 / 05:52 PM IST
Follow us on

సాంకేతిక నైపుణ్యతతో పక్షి జాతులు అంతరిస్తున్నాయి. ప్రపంచ మానవాళికే ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. అయినా మన దేశం పట్టించుకోవడం లేదు. ఫలితంగా దుష్ఫలితాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఇండియాలో అతి త్వరలో 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి రానుంది. దీంతో 5జీ నెట్ వర్క్ చుట్టూ కొన్ని రోజులుగా ఓ వివాదం రగులుతోంది.

భారత్ లో 5జీ టెక్నాలజీ ట్రయల్ రన్ చేయడం వల్లే కరోనా సెకండ్ వేవ్ వ్యాపించిందని పుకార్లు వ్యాపించాయి. ఇందులో ఏ మాత్రం నిజం లేదని నిపుణులు సదరు ఫేక్ వార్తలను ఖండించారు. 5జీ టెక్నాలజీ ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.సెల్యులార్ ఆపరేటర్ల అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇది ముమ్మాటికి తప్పుడు ప్రచారం అని తేల్చింది.

5జీ టెక్నాలజీచాలా సురక్షితమైందని అన్ని ఆధారాలు దీన్ని ఆచరిస్తున్నాయని తెలిపింది. 5జీ టెక్నాలజీ రాకతో ఆర్థిక రంగంతో పాటు సమాజానికి అనేక ప్రయోజనాలు జరుగుతాయని సీవోఏఐ అభిప్రాయపడింది. భారత్ లో టెలికాం రంగంలో విధించిన ఎలక్ర్టోమాగ్నటిక్ రేడియేషన్ పరిమితి అంతర్జాతీయంగా ఆమోదించిన పరిమాణంలో పదో వంతు మాత్రమేనని సీవోఏఐ డైరెక్టర్ తెలిపారు. బాలీవుడ్ నటి జూహీచావ్లా వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఆమెతో పాటు ఇద్దరు పిటిషనర్లకు రూ.20 లక్షల జరిమానా విధించింది.

రేడియో ఫ్రీక్వెన్సీని వినియోగించడం మొదలై శతాబ్దం కావస్తోంది. 5జీలోని రేడియో ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ ప్రాంతాలను సైతం సరిగా అందాలంటే సెల్ టవర్లు ముమ్మరంగా వినియోగించాలి. జనాభాలో అత్యధికులు దీని ప్రభావానికి లోనుకాక తప్పదు. సాంకేతికత ఆధారంగా 5జీని కొలవడం సరికాదన్నదే నిపుణుల భావన. 44 దేశాల నంచి 253 మంది శాస్ర్తవేత్తలు ఐఏఆర్ సీకి లేఖ రాశారు.