IPL 2023 : ఐపీఎల్ సీజన్ 16 సంచలనాలకు వేదికవుతోంది. రికార్డులు బద్దలవుతున్నాయి. ప్రతీ మ్యాచ్ రసకందాయంగా సాగుతోంది. క్రికెట్ ప్రేమికులు ఈ సీజన్‌లో బౌలర్లు వేసే ప్రతీ బంతిని.. బ్యాట్స్‌మెన్స్ చేసే ప్రతీ పరుగును ఆస్వాదిస్తున్నారు. అయితే ఈ సీజన్ క్రికెటర్లు శక్తికి మించి శ్రమించాల్సి వస్తోంది. జట్టుగా 200 పరుగుల భారీ స్కోర్ చేసినా ప్రత్యర్థి జట్టుకు అది తక్కువ స్కోరే అవుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 200 ప్లస్ పరుగులు చేసినా.. ప్రత్యర్థి జట్లు ఈజీగా ఛేదిస్తోంది. ఇక మరో విషయం ఏమిటంటే ఈ సీజన్‌లో స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగుతోంది. జయాపజయాలను నిర్ణయిస్తున్నారు. ఇక ఈ సీజన్‌లో మరో విశేషం.. హోం గ్రౌండ్‌లోనూ జట్లు విజయం ముంగిట చతికిల పడుతున్నాయి.
సీజన్‌లో సగం మ్యాచ్‌లు పూర్తి..
ఐపీఎల్ సీజన్ 16లో ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తయ్యా. అన్ని జట్లు 7 మ్యాచ్‌లు అడాయి. ఈ సీజన్‌లో చాలా జట్లు 200కు పైగా స్కోర్ సాధించాయి. కొన్ని జట్లు 200 ప్లస్ స్కోర్‌ను కూడా ఛేదించాయి. అంటే ఈ సీజన్‌లో ఏ జట్టూ తగ్గేదే లే అన్నట్లుగా ఆడుతున్నాయి. ఇప్పటి వరకు 34 మ్యాచ్‌లు జరుగగా ఇందులో 16 మ్యాచ్‌లు ఏకపక్షంగా జరిగాయి. మరో 18 మ్యాచ్‌లు నువ్వా నేనా అన్నట్లుగా చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగాయి.
ఏకపక్షం ఇలా..
ఏకపక్షంగా సాగిన 16 మ్యాచ్‌లలో ఛేజింగ్ జట్టు కనీసం ఒక ఓవర్ లేదా అంతకంటే ఎక్కువ మిగిలి ఉండగానే విజయం సాధించాయి. కనీసం మూడు వికెట్ల తేడాతో గెలిచాయి. ఇక మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 15 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో గెలిచాయి. ఈ సీజన్‌లో ఏకపక్ష ఫలితాల శాతం 45.7 గా నమోదైంది.
– ఇదే సీజన్‌లో మరో 11 మ్యాచ్‌లు ఛేజింగ్ జట్టు 10 కన్నా తక్కువ పరుగుల తేడాతో ఓడిపోయాయి. ఒక బంతి కంటే ఎక్కువ ఉండగానే విజయం సాధించాయి.
– మూడు మ్యాచ్‌లలో ఒకటి ‘క్లోజ్’ ఫినిష్‌గా ఉంది. గతంలో ఏ సీజన్‌లోనూ ప్రస్తుతమున్నంత క్లోజ్ గేమ్‌లు కనిపించలేదు.
గతంలో 200 ప్లస్ చాలా తక్కువ..
ఐపీఎల్ గత 15 సీజన్లలో 200 పరుగులు చాలా తక్కువసార్లు నమోదయ్యాయి. 200 పరుగులు చేసిన జట్లు కచ్చితంగా విజయం సాధించాయి. కానీ సీజన్ 16లో మాత్రం 200 పరుగులు చేసినా గెలుస్తామన్న నమ్మకం ఉండం లేదు. ప్రత్యర్థుల దూకుడు ముందు 200 ప్లస్ స్కోర్ కూడా చిన్నబోతోంది. గత సీజన్ మొత్తంలో 11 సార్లు మాత్రమే 200 ప్లస్ స్కోర్ నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన 35 మ్యాచ్‌లలోనే 11 సార్లు 200 ప్లస్ స్కోర్ సాధించాయి. ఇంకా సగం మ్యాచ్‌లు ఉన్నందు 200 ప్లస్ స్కోర్ నమోదైన అత్యధిక మ్యాచ్‌లు ఈ సజీన్‌లోనే నమోదు కావడం ఖాయం. ఇక ఈ సీజన్‌లో 180 కన్నా ఎక్కువ స్కోరు 28 సార్లు నమోదైంది. ఇప్పటి వరకు జరిగిన సీజన్లలో ఇదే గరిష్టం.
సొంత గ్రౌండ్‌లోనూ ఓటమి…
ఇక ఈ సీజన్‌లో మూడు జట్లు సొంత మైదానంలోనూ గెలవలేకపోతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజ్ బెంగళూరు, ముంబై జట్లు తమ తమ సొంత మైదానంలో ప్రత్యర్థుల చేతుల్లో చిత్తయ్యాయి. సాధారణంగా హోం గ్రౌండ్ మ్యాచ్‌లు ఆతిథ్య జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. గత సీజన్లలో ఇలాగే జరిగింది. కానీ, ఈ సీజన్లలో మూడు జట్లు సొంత మైదానంలోనూ గెలుపు ముంగిట బోల్తా పడుతున్నాయి.
పెరిగిన బ్యాట్స్‌మెన్స్ స్ట్రైక్ రేట్..
ఇక ఐపీఎల్ సీజన్ 16లో బ్యాట్స్‌మెన్‌ల స్ట్రైక్‌రేట్ భారీగా నమోదవుతోంది. ఈ సీజన్ ప్రారంభంలోనే బ్యాట్స్‌మెన్ల స్ట్రైక్‌రేట్ సగుటున 141.8 గా నమోదైంది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్లలో మొదటి సగం మ్యాచ్‌లలో నమోదైన అత్యధిక స్ట్రైక్‌రేట్ ఇదే. ఇక ఛేజింగ్‌లతో సహా, ఈ సంవత్సరం మొదటి 35 మ్యాచ్‌లలో బ్యాటర్లు 138.8 స్ట్రైక్‌రేట్ నమోదు చేశారు. ఐపీఎల్ 2018లో స్ట్రైక్‌రేట్ గరిష్టంగా 138.7గా నమోదైంది.
అసాధారణంగా రన్‌రేట్..
ఇక ఐపీఎల్ సీజన్ 16లో జట్ల రన్‌రేట్ అసాధరణంగా నమోదవుతోంది. గతంలో ఏ సీజన్‌లోనూ నమోదు కానంత స్ట్రైక్‌చేట్ ఈ సీజన్‌లో నమోదవుతోంది. ఒక మ్యాచ్‌కు మించి మరో మ్యాచ్‌లో రన్‌రేట్ పెరుగుతూనే ఉంది. 6 కన్నా తక్కువ రన్‌రేట్ నమోదైన మ్యార్‌లు చాలా తక్కువగా ఉన్నాయి.
స్పిన్నర్ల హవా..
ఇక ఐపీఎల్ సీజన్ 16లో స్పిన్నర్లు ప్రభావం చూపుతున్నారు. పరుగులు అధికంగా ఇస్తున్నప్పటికీ గెలుపోటములని శాసిస్తున్నారు. మ్యాచ్‌ను టర్న్ చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన 35 మ్యాచ్‌లలో స్పిన్నర్లు 177 వికెట్లు తీశారు. స్పీన్నర్లు ఒక ఇన్నింగ్స్‌లో గత సీజన్లకన్నా ఎక్కువగా బౌలింగ్ చేయనప్పటికీ వికెట్లు మాత్రం ఈ సీజన్‌లోనే ఎక్కువ సాధిస్తున్నారు. ఒక మ్యాచ్‌లో స్పిన్నర్ల సగటు బౌలింగ్ ఈ ఏడాది 48.2 బంతులుగా నమోదైంది. 2019లో స్పిన్నర్ల సగటు 47.6 బంతులు, 2018లో 46.5 బంతులుగా ఉంది. ఈ సీజన్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో నాణ్యత పెరగడంతో వికెట్లు అధికంగా తీస్తున్నారు. ఇప్పటి వరకు వారు ప్రతీ 19.1 బంతుల్లో ఒక వికెట్ తీశారు. 35 మ్యాచ్‌ల తర్వాత వారి స్ట్రైక్ రేట్ 20 కంటే తక్కువగా ఉన్న మొదటి సీజన్ ఇదే.
మొత్తంగా ఐసీఎల్ సీజన్16 మ్యాచ్‌లు రంజుగా, రసకందాయంగా, క్రికెట్ ప్రేమికులను అలరించేలా సాగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన సగం మ్యాచ్‌లు క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించాయి. మరి మిగతా సగం ఎలా జరుగుతాయో చూడాలి.