https://oktelugu.com/

IPL 2024 : అందుకే అతడికి చెన్నై జట్టు పగ్గాలు ఇవ్వలేదు

ఈ జాబితాలో మేము జడేజాను పరిగణలోకి తీసుకోలేదు. గతంలో కెప్టెన్ గా నియమిస్తే జడేజా ఒత్తిడి తట్టుకోలేకపోయాడు. ఆయన వ్యక్తిగత ప్రదర్శన కూడా బాగోలేదు. ధోని జడజ మధ్య విభేదాలు అనేవి లేవు. దేశవాళి క్రికెట్లో గైక్వాడ్ కు కెప్టెన్ గా చేసిన అనుభవం ఉంది. పైగా అతడు 27 ఏళ్ల కుర్రాడు. అందువల్లే అతడి వైపు మేము ఆసక్తి ప్రదర్శించామని" చెన్నై జట్టు యాజమాన్యం ప్రకటించింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 21, 2024 9:43 pm
    IPL 2024

    IPL 2024

    Follow us on

    IPL 2024 : 17వ సీజన్ కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం బెంగళూరు తో జరిగే మ్యాచ్ కు కొద్ది గంటల ముందు చెన్నై జట్టు కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. దీంతో ఒకసారిగా కలకలం చెలరేగింది. ఉన్నట్టుండి ధోని ఎందుకు కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు? ఎవరైనా ఏమైనా అన్నారా? లేక గతంలో లాగా యాక్టివ్ గా ఆడలేనని ధోని ఆ నిర్ణయం తీసుకున్నాడా.. ఇలా రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. కాలం గడిస్తే తప్ప ధోని ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియదు. ధోని కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకోవడంతో చెన్నై జట్టు కెప్టెన్ గా రుత్ రాజ్ గైక్వాడ్ ను నియమించింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసింది.

    చెన్నై యాజమాన్యం ప్రకటన చేయడంతో ఐపీఎల్ 2024 సీజన్ ట్రోఫీ తో ఫోటోషూట్ కార్యక్రమానికి గైక్వాడ్ హాజరయ్యాడు. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన ధోని.. ఈ సీజన్లో పూర్తిస్థాయిలో బరిలోకి ఈ సీజన్లో పూర్తిస్థాయిలో బరిలోకి ఈ సీజన్ లో అసలు మైదానంలోకి దిగుతాడా ? లేక ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడతాడా? లేకుంటే ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించి మెంటర్ గా వ్యవహరిస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.

    ధోని చెన్నై కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకోగానే అందరూ ఆ జట్టులో సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజాను కెప్టెన్ గా నియమిస్తారని అనుకున్నారు.. అయితే చెన్నై జట్టు యాజమాన్యం రవీంద్ర వైపు కాకుండా.. గైక్వాడ్ వైపు మొగ్గు చూపింది. మరోవైపు ధోనితో జడేజా కు ఉన్న గొడవల వల్లే.. గైక్వాడ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ లో 2022 సీజన్ కు సంబంధించి మెగా వేలం నిర్వహించారు. అప్పట్లో చెన్నై జట్టు కెప్టెన్సీ బాధ్యతలను జడేజాకు అప్పగించింది. ఐపీఎల్ లో కెప్టెన్సీ అనేది చాలా ఒత్తిడితో కూడుకొని ఉంటుంది. అయితే ఆ ఒత్తిడిని జడేజా భరించలేకపోయాడు. అది ఆ జట్టు విజయాలపై ప్రభావాన్ని చూపించింది. ఫలితంగా వరుస ఓటములతో దారుణ వైఫల్యాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు యాజమాన్యం జడేజాను మధ్యలోనే తప్పించి.. ధోనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే జడేజా గాయం అయిందని చెప్పి ఆ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత అది సాకు మాత్రమేనని తేలింది.

    కెప్టెన్సీ నుంచి తప్పించడంతో జడేజా ఆ సమయంలో అవమానంగా భావించాడనే పుకార్లు వినిపించాయి. ఒకానొక దశలో జడేజా చెన్నై జట్టును విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాడని కథనాలు వినిపించాయి. ఈ కథనాలను అప్పటి చెన్నై సూపర్ ఈ కథనాలను చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ తప్పు పట్టారు. ఇక గత సీజన్లో ధోని కెప్టెన్సీలో చెన్నై జట్టు కప్ దక్కించుకుంది. గుజరాత్ జట్టు జరిగిన ఫైనల్ మ్యాచ్లో రవీంద్ర జడేజా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. వీరోచిత బ్యాటింగ్ తో చెన్నై జట్టును గెలిపించాడు. అయితే ధోనికి, జడేజాకు మధ్య విభేదాలు లేవని.. ఆ ఫైనల్ మ్యాచ్ ద్వారా నిరూపితమైంది. కానీ గైక్వాడ్ ను కెప్టెన్ గా నియమించడంతో.. మళ్లీ ఆ పుకార్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు యాజమాన్యం స్పందించాల్సి వచ్చింది.”ధోని వైదొలగగానే కెప్టెన్ గా గైక్వాడ్ ను నియమించాం. ఈ జాబితాలో మేము జడేజాను పరిగణలోకి తీసుకోలేదు. గతంలో కెప్టెన్ గా నియమిస్తే జడేజా ఒత్తిడి తట్టుకోలేకపోయాడు. ఆయన వ్యక్తిగత ప్రదర్శన కూడా బాగోలేదు. ధోని జడజ మధ్య విభేదాలు అనేవి లేవు. దేశవాళి క్రికెట్లో గైక్వాడ్ కు కెప్టెన్ గా చేసిన అనుభవం ఉంది. పైగా అతడు 27 ఏళ్ల కుర్రాడు. అందువల్లే అతడి వైపు మేము ఆసక్తి ప్రదర్శించామని” చెన్నై జట్టు యాజమాన్యం ప్రకటించింది.