IPL CSK: ఆటతో చెలరేగే ఆటగాడు నాయకత్వంలో తడబడుతాడు. నాయకత్వంలో , ఆటలో రాణించే ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్ లో చాలా అరుదుగా ఉంటారు. కానీ వాళ్లు సంవత్సరాల తరబడి అలా కొనసాగలేరు. ఆటగాడిగా.. కెప్టెన్ గా రెండు బాధ్యతలు విజయవంతంగా నడిపిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్లలో ‘ఎంఎస్ ధోని’ ముఖ్యుడు. 2007లో సీనియర్లు విఫలమై కెప్టెన్సీ వదిలేసిన క్లిష్ట సమయంలో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి తొలి ప్రయత్నంలోనే టీ20 ప్రపంచకప్ ను అందించిన మేధావి మన ధోని. ఆ తర్వాత తన వ్యూహాలతో భారత క్రికెట్ జట్టును వన్డే, చాంపియన్స్ ట్రోఫీలను గెలిపించుకొచ్చాడు. ధోని హయాంలో అన్నీ ఐసీసీ ట్రోఫీలను టీమిండియా గెలిచేసింది.

ఇక టీమిండియానే కాదు.. ఐపీఎల్ లో విజయవంతమైన కెప్టెన్ గా ఎంఎస్ ధోని నిలిచాడు. ఏకంగా నాలుగు సార్లు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ధోని తన సారథ్యంలో విజేతగా నిలిచాడు. ఇక ఈ సీజన్ ప్రారంభానికి రెండు రోజుల ముందు ధోని జట్టు పగ్గాలను వదిలేశాడు. రవీంద్రా జడేజాను కెప్టెన్ గా నియమించారు. ధోని స్వతహాగానే తప్పుకొని భావి చెన్నై కెప్టెన్ గా రవీంద్ర జడేజాను తీర్చిదిద్దాలని అనుకున్నాడు.
ఇక టీమిండియా పగ్గాలను కూడా ఇలానే ధోని వదిలేశాడు. భావి భారత జట్టు పగ్గాలను అప్పట్లో పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లీ చేతుల్లో పెట్టాడు. అది సక్సెస్ అయ్యింది. విరాట్ ఎన్నో విజయాలు అందించినా.. ప్రపంచకప్ లు కొట్టలేని అపఖ్యాతి మూటగట్టుకున్నాడు.
ఇప్పుడు రవీంద్ర జడేజా ధోని నుంచి పగ్గాలు అందుకొని విఫలమయ్యాడు. మరోవైపు ఆల్ రౌండర్ పాత్రను పోషించడంలో జడేజీ పూర్తిగా విఫలమయ్యాడు. ఈనేపథ్యంలోనే జడేజా కూడా తనకు కెప్టెన్సీ వద్దని వైదొలిగాడు. దీంతో మరోసారి ఎంఎస్ ధోనిని జట్టు కెప్టెన్ గా చెన్నై యాజమాన్యం నియమించింది.
ఇప్పటివరకూ చెన్నై ఎనిమిది మ్యాచులు ఆడింది. కేవలం రెండింటిలోనూ విజయం సాధించింది. ఈ క్రమంలోనే జడేజా ఆటగాడిగా.. కెప్టెన్ గానూ విఫలం అయ్యాడు. ఈక్రమంలోనే జడేజా పగ్గాలు వదిలేసి మళ్లీ ధోనికి అప్పగించాడు.
https://twitter.com/ChennaiIPL/status/1520397920419295232?s=20&t=sUh4CUdMEpuORWZ2t6ArHg