హ్యాపీ ఉమెన్స్ డే.. మ‌న హీరోలు ఎలా చెప్పారో తెలుసా?

‘‘ఆమె..’’ మ‌గాడి జీవితంలో లేనిదెక్కడ..? వెన్నంటి ఉండ‌నిదెన్న‌డు..? అసలు.. ఆమె లేనిది పురుషుడెక్కడ..? త‌ల్లిగా ప్రాణం పోస్తుంది. భార్య‌గా బ‌తుకంతా తోడుంటుంది. చెల్లిగా అల్ల‌రి చేస్తుంది.. అక్క‌గా బాధ్య‌త తీసుకుంటుంది. అందుకే.. ఆమెలేని మ‌గాడు ఒట్టి మోడు! ఇవాళ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం. ఈ సంద‌ర్భంగా ఆమె త్యాగాన్ని, మ‌గాడి భాగ్యాన్ని.. గుర్తు చేసుకున్నారు సినీ ప్ర‌ముఖులు. ఉమెన్స్ డే సంద‌ర్భంగా త‌మ జీవితంలో మ‌హిళ‌ల పాత్ర ఎంత‌టి ప్ర‌ముఖ‌మైన‌దో.. వారిని తాము ఎంత‌గా ప్రేమిస్తున్నామో చాటి […]

Written By: Bhaskar, Updated On : March 8, 2021 3:01 pm
Follow us on


‘‘ఆమె..’’ మ‌గాడి జీవితంలో లేనిదెక్కడ..? వెన్నంటి ఉండ‌నిదెన్న‌డు..? అసలు.. ఆమె లేనిది పురుషుడెక్కడ..? త‌ల్లిగా ప్రాణం పోస్తుంది. భార్య‌గా బ‌తుకంతా తోడుంటుంది. చెల్లిగా అల్ల‌రి చేస్తుంది.. అక్క‌గా బాధ్య‌త తీసుకుంటుంది. అందుకే.. ఆమెలేని మ‌గాడు ఒట్టి మోడు! ఇవాళ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం. ఈ సంద‌ర్భంగా ఆమె త్యాగాన్ని, మ‌గాడి భాగ్యాన్ని.. గుర్తు చేసుకున్నారు సినీ ప్ర‌ముఖులు.

ఉమెన్స్ డే సంద‌ర్భంగా త‌మ జీవితంలో మ‌హిళ‌ల పాత్ర ఎంత‌టి ప్ర‌ముఖ‌మైన‌దో.. వారిని తాము ఎంత‌గా ప్రేమిస్తున్నామో చాటి చెప్పారు. త‌మ చుట్టూ ఉన్న‌వారితోపాటు ప్ర‌పంచంలోని మ‌హిళ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలియ జేశారు టాలీవుడ్ స్టార్స్‌. ఈ మేర‌కు సోష‌ల్‌మీడియాలో పోస్టు చేశారు. మ‌రి, వారేం పోస్టు చేశారో చూద్దామా..

మ‌హేష్ బాబుః నా చుట్టూ ఉన్న మ‌హిళ‌ల‌తోపాటు ప్ర‌పంచంలో ఉన్న అతివ‌లంద‌రికీ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.

నాగ‌శౌర్యః మ‌న ఇంట్లోని మ‌హిళ‌లు చిరున‌వ్వులు చిందిస్తే ప్ర‌పంచ‌మంతా ఆనందంగా ఉంటుంది. నా లోకంలోని మ‌హిళ‌ల‌తోపాటు ప్ర‌పంచంలోని ప్ర‌తీ అతివ‌కు మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.

సుధీర్ బాబుః పితృస్వామ్యానికి ఎదురొడ్డి నిలిచి, స‌మాజంలో స‌మాన‌త్వం ఉండాల‌నే ప్రాథ‌మిక బాధ్య‌త‌ను వారు మ‌న‌కు నేర్పారు. కానీ.. నేటికి మ‌న స‌మాజంలో జీవ‌నశైలి మెరుగ్గా ఉన్నా.. ఆద‌ర్శంగా మాత్రం లేదు. మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.

ద‌ర్శ‌కుడు బాబీః అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.

అన్న‌పూర్ణ స్టూడియోస్ః అన్న‌పూర్ణ‌మ్మ‌తో మొద‌లైన ఈ ప్ర‌యాణంలో ఎంతో మంది మ‌హిళ‌లు తోడ‌వుతూ వ‌స్తున్నారు. మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.

వ‌కీల్ సాబ్ యూనిట్ః మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా అంద‌రికీ శుభాకాంక్ష‌లు.