హిందూ పురాణాలలో శివునికి ఎంతో శక్తివంతమైన దేవునిగా భావిస్తారు. అంతేకాకుండా మన దేశంలో అన్ని ప్రాంతాలలో ఈ శివ మందిరాలు మనకి దర్శనమిస్తాయి. ఇంతటి ప్రసిద్ధి చెందిన ఆ శివుణ్ణి వివిధ రకాల పేర్లతో పిలవడం మనం చూస్తూనే ఉన్నాం. అలంకార ప్రియుడని, మల్లికార్జునుడు, అభిషేక ప్రియుడు, బోలా శంకరుడు, నీలకంటేశ్వరడు ఇలా వివిధ రకాల పేర్లతో ఆ పరమశివుని పూజించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే శివుని ఫోటోను మనం గమనించినప్పుడు శివుని కంఠం నీలి రంగులో ఉంటుంది. ఆ విధంగా శివుని కంఠం ఎందుకు నీలి రంగులో ఎందుకు ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం…
Also Read: పెళ్లి చేసుకునే వారికి షాకింగ్ న్యూస్.. వారం తర్వాత ముహుర్తాలు లేవట..!
మన పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు బద్ధశత్రువుగా ఉండేవారు. వీరు అమరవీరులగా ఉండాలంటే సముద్రగర్భం నుంచి వెలువడే అమృతాన్ని సేవించడం వల్ల వీరికి మరణం ఉండదని భావించిన దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మధనం చేస్తారు.ఆ విధంగా క్షీరసాగరమధనం చేస్తున్న సమయంలో సముద్రగర్భం నుంచి ఒక్కొక్కటిగా ఉద్భవిస్తాయి. మొదటగా సముద్రగర్భం నుంచి కామదేనువు బయటకు రావడంతో దాని విశిష్ట దేవుడు తీసుకుంటాడు. తరువాత కల్పవృక్షం సముద్రగర్భం నుంచి బయటకు రావడంతో ఆ వృక్షాన్ని ఇంద్ర దేవుడు తీసుకుంటాడు.
Also Read: ఇంటికి కిటికీలు, గుమ్మాలు బేసి సంఖ్యలో ఉండకూడదా..?
అమృతం కోసం క్షీరసాగర మధనం చేస్తున్నప్పుడు సముద్రం నుంచి విషం బయటకు వస్తుంది. అయితే ఈ విషాన్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. అప్పుడు దేవతలు, రాక్షసులు కలిసి ఆ పరమేశ్వరుని వేడుకుంటారు. నమ్మిన వారికి సహాయం చేయడం ఆ శివుడి ధర్మం కాబట్టి సముద్రగర్భం నుంచి వెలువడిన విషాన్ని పరమశివుడు తాగుతాడు. అయితే ఈ విషం ఎంతో ప్రమాదమైనది కాబట్టి, ఆ విషాన్ని మింగకుండా, తన కంఠంలోనే ఉంచుకోవటం వల్ల శివుని కంఠం నీలి రంగులో ఉంటుంది. అందుకే శివునికి నీలకంటేశ్వరుడు అని కూడా పిలుస్తారు.
మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం