IND vs ENG : ఏం పిచ్ రా బాబూ.. మన బౌలర్లు తిప్పేశారు.. విలవిలలాడి ఓడిన ఇంగ్లండ్…

కానీ ఇంగ్లాండ్ టీంను 129 రన్స్ కే ఆలౌట్ చేసి ఒక భారీ విక్టరీని అందుకుంది. ఇక దీంతో వరుసగా ఆరు విజయాలను అందుకొని ఇండియన్ టీం పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్లిపోయింది..

Written By: NARESH, Updated On : October 29, 2023 9:36 pm

IND vs Eng

Follow us on

IND vs ENG : వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా టీం 229 పరుగులు చేసింది. ఇండియన్ టీం లో రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ ,సూర్య కుమార్ యాదవ్ వీరి ముగ్గురు రాణించడంతో ఇండియా టీం ఈ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. అయితే లక్నోపిచ్ ఇంతకుముందు బ్యాటింగ్ కి ఎక్కువగా అనుకూలించే పిచ్ గా ఉండేది కానీ ఇప్పుడు బౌలింగ్ కి బాగా అనుకులించింది.ఇక ఇంగ్లాండ్ టీం పరిస్థితి కూడా అంతే వాళ్ళ ఓపెనర్లు కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లందరు కూడా వరుసగా పెవిలియన్ బాట పట్టారు.

ఇక ఇండియన్ బౌలర్లలో మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి మరోసారి తన స్టామిన ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. అలాగే తనకి వచ్చిన అవకాశాన్ని మరోసారి బాగా వాడుకున్నాడు.. అలాగే జాస్ప్రిత్ బుమ్ర, కుల్దీప్ యాదవ్ లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ ఎక్కువ స్కోర్ చేయకుండా చేశారు.ఇక ఇండియన్ టీం మొదట బ్యాటింగ్ చేస్తుంది అంటే ఈ మ్యాచ్ లో దాదాపు 300 కి పైన పరుగులు నమోదు చేస్తుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఇండియన్ టీం లో ప్రతి ప్లేయర్ కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. అయినప్పటికీ 229 రన్స్ చేయడం అంటే నిజంగా చాలా నిరాశని కల్గించే విషయం అనే చెప్పాలి.

ఇక ఈ మ్యాచ్ లో తక్కువ స్కోర్ చేసినా కూడా ఇండియన్ టీమ్ బౌలర్ లు ఆ స్కోర్ ని డిఫెన్స్ చేసుకుంటూ ఇంగ్లాండ్ ప్లేయర్లని ముప్పు తిప్పలు పెట్టారు. ఇట్లాంటి టైమ్ లోనే ఇండియన్ బౌలర్లను మనం మెచ్చుకోవాలి.ఎందుకంటే తక్కువ స్కోరు ఉందని ఏమాత్రం డీలా పడకుండా అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వచ్చారు.ఇక ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఈ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందా అనే అనుమానాలు చాలామందిలో వ్యక్తం అయ్యాయి.

కానీ ఇంగ్లాండ్ టీంను 129 రన్స్ కే ఆలౌట్ చేసి ఒక భారీ విక్టరీని అందుకుంది. ఇక దీంతో వరుసగా ఆరు విజయాలను అందుకొని ఇండియన్ టీం పాయింట్స్ టేబుల్ లో నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్లిపోయింది…ఇక దీంతో పాటు ఇండియన్ సెమీస్ కి కూడా క్వాలిఫై అయిందని తెలుస్తుంది…