Indian Judiciary: అందరికీ న్యాయం చేసే న్యాయశాఖ దేశంలో ఎంత పవర్ ఫుల్ గా ఉంటే దేశంలో ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా ఉంటుందంటారు. ఎందుకో కానీ మన భారతదేశంలో న్యాయవ్యవస్థ తీరుపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా తీర్పులిచ్చాడని.. ఆయన రిటైర్ అయ్యాక ఈశాన్య రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీ టికెట్ ఇచ్చి గౌరవించడం విమర్శలకు దారితీసింది. అయోధ్య లాంటి క్లిష్టమైన తీర్పును ఇచ్చిన ఆయన బీజేపీకి ఫేవర్ గా ఉన్నాడని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
Also Read: Development works in Amaravati: అమరావతిలో పనులు ఆదాయం కోసమా? వ్యూహాత్మకంగా వైసీపీ సర్కారు?
ఇక ఇదే కాదు.. గత యూపీఏ హయాంలోనే కాంగ్రెస్ కు అనుకూలంగా న్యాయవ్యవస్థ మసులుకొని బీజేపీ పెద్దలైన అమిత్ షా, మోడీలను కేసుల్లో ఇరికించారని విమర్శలున్నాయి. అమిత్ షాను ఏకంగా కొన్ని నెలలు జైల్లో పెట్టి ఢిల్లీలో ఉండి కేసులు ఎదుర్కొనే పరిస్థితికి తెచ్చారని ఆరోపణలున్నాయి.
అయితే న్యాయవ్యవస్థలో చూస్తే మెజార్టీ జడ్జీలు వారి కుటుంబీకులే అత్యున్నత స్థానాల్లో ఉన్నారని.. వారి వారినే నామినేట్ చేస్తున్నారని.. దేశంలో 350 కుటుంబాల చేతుల్లోనే న్యాయవ్యవస్థ ఉందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. కొన్ని గణాంకాలను వారు బయటపెడుతున్నారు.

భారతదేశంలోని ప్రతి ముగ్గురు న్యాయమూర్తులలో ఒక న్యాయమూర్తి మరొక న్యాయమూర్తి మామ, మేనల్లుడు, కొడుకు లేదా బంధువు అని గణాంకాలతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.. భారతదేశంలోని 70 ఏళ్ల న్యాయ వ్యవస్థ కేవలం 350 కుటుంబాలలో తిరుగుతోందంటున్నారు. వారు కలిసి న్యాయమూర్తులను ఎన్నుకుంటారు. న్యాయవ్యవస్థలో “కుటుంబ వాదం” అనే “ప్రకటించని రిజర్వేషన్” అమలులో ఉన్న ఏకైక దేశం భారతదేశం అని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎన్నో సంస్కరణలు చేసి దేశంలో కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఈ న్యాయవ్యవస్థలోని కుటుంబ వాదంపై కూడా దృష్టి సారించాలని కోరుతున్నారు.
Also Read:PM Modi- Jagan: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జగన్ నోట ప్రత్యేక హోదా మాట
[…] Also Read:Indian Judiciary: 350 కుటుంబాల చేతుల్లోనే భారత న్య… […]