Team India: ఇండియన్ క్రికెట్ టీం లో ఎలాంటి మతపరమైన, కులపరమైన, ప్రాంతీయ పరమైన, అగ్ర, బీద అనే వర్ణాలు చూపించకుండా ఎవరైతే మ్యాచ్ ని గెలిపిస్తారో వాళ్లని మాత్రమే టీమ్ లోకి తీసుకొని వాళ్లతోనే క్రికెట్ ఆడిస్తున్నారు. ఇలాంటి టైం లో చాలా మంది కి చాలా అపోహలు ఉంటాయి మనం ముస్లింలం మనకి క్రికెట్ లో ఎక్కువ అవకాశాలు ఇవ్వరు, మనం లేనోల్లం మనలని ఎదగనివ్వరు, మనది వెనకబడ్డ ప్రాంతం మనల్ని ముందుకు రానివ్వరు,క్రికెట్ అంటే డబ్బు ఉన్నోల్లు ఆడుకునే ఆట మనకు రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళం మనకెందుకు ఈ ఆటలన్ని అనే అపోహలకు, ఊహాలకి చెక్ పెడుతూ బిసిసిఐ ముందుకు కదులుతుంది. నీ బ్యాక్ గ్రౌండ్ తో పని లేదు నువ్వు గ్రౌండ్ లో ఉన్నప్పుడు నీ సత్తా చూపిస్తు ఆడగలవా..? నీ తెగింపు తో ఇండియన్ టీమ్ ని నెంబర్ వన్ స్థానం లో నిలపగలవా..? టీమ్ ని గెలిపించాలని భావన నీ గుండెల్లో ఉండి బ్యాట్ తో నువ్వు అద్భుతాలు చెయ్యగలవా అయితే నువ్వే ఇండియన్ టీమ్ కి కావాలి…నీకు ఏం ఉంది ఏం లేదు వదిలేయి నీ దగ్గర టాలెంట్ ఉంటే సరిపోతుంది అనే రేంజ్ లో బిసిసిఐ ప్లేయర్లను సెలెక్ట్ చేస్తూ ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తూ ఆడిస్తుంది…
నిజంగా బిసిసిఐ మతం, ప్రాంతం,డబ్బు అన్ని పట్టించుకున్నటైతే ముస్లిం లు అయిన మహమ్మద్ శమి, మహమ్మద్ సిరాజ్ లాంటి ప్లేయర్లు ఇండియన్ టీమ్ లో ఆడేవారు కాదు, వాళ్ల దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు వాళ్ళు వాటిని వాడుకొని ఇప్పుడు టాప్ బౌలర్లు గా ఇండియన్ టీం లో కొనసాగుతున్నారు. అంటే బీసీసీఐ ఎలాంటి భేషజాలు లేకుండా వాళ్ళకి అవకాశాలు ఇచ్చింది కాబట్టి వాళ్లు వాటిని సద్వినియోగపరుచుకొని ప్రస్తుతం ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ వన్ బౌలర్లు గా కొనసాగుతున్నారు. ఇక దీన్నిబట్టి బిసిసిఐ ప్లేయర్ల విషయం ఎలాంటి మతపరమైన వివక్షలను చూపించట్లేదు అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది…
ఇక ఇదే నేపథ్యంలో ఇంతకు ముందు సూపర్ సక్సెస్ అయిన ప్లేయర్లు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ల కొడుకులను క్రికెటర్లుగా చేయాలని చాలామంది అనుకున్నారు. అందులో యోగరాజ్ సింగ్ లాంటి ప్లేయర్ యువరాజ్ సింగ్ లాంటి ఒక అత్యుత్తమమైన ప్లేయర్ ని ఇండియన్ టీమ్ కి అందించాడు. యువరాజ్ సింగ్ దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి ఆయన తనని తాను ప్రూవ్ చేసుకొని టీమ్ లో చోటు సంపాదించుకున్నాడు. అంతే తప్ప వాళ్ల నాన్న సీనియర్ ప్లేయర్ అనే కారణాల వల్ల ఆయనకి టీమ్ లో చోటు రాలేదు…
ఇక మాజీ ప్లేయర్ల కొడుకులని టాలెంట్ లేకపోయిన ఇండియన్ టీమ్ లోకి తీసుకుంటారు అనేది అపోహ ఎందుకంటే ఒకప్పటి లెజెండరీ క్రికెటర్ అయిన సునీల్ గవాస్కర్ కొడుకు రోహన్ గవాస్కర్ ఇండియన్ టీం లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన పేలవమైన పర్ఫామెన్స్ ఇవ్వడంతో సెలక్టర్లు అతన్ని తీసి పక్కన పెట్టారు. ఆయన దగ్గర టాలెంట్ లేదని ఆయన ప్లేస్ లో ఇంకో ప్లేయర్ ని టీం లోకి తీసుకున్నారు అంతే తప్ప సునీల్ గవాస్కర్ కొడుకు అనే ఉద్దేశ్యంతో మాత్రం అతన్ని టీం లోకి తీసుకోలేదు…
ఇక ఇదే విషయం మీద ఇంకొక ఉదాహరణ చెప్పాలి అంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే క్రికెట్ గాడ్ గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ కొడుకు అయిన అర్జున్ టెండూల్కర్ కూడా ప్రస్తుతం క్రికెట్ లో యాక్టివ్ గా ఉంటున్నాడు. అయిన కూడా ఆయన స్థాయి మేరకు అంత పర్ఫామెన్స్ ఇవ్వడం లేదు కాబట్టి తనకి ఇండియన్ టీం లో ఇంకా అవకాశం అయితే రాలేదు.అయితే సచిన్ ఇండియన్ టీం కి అందించిన సేవలు చాలా గొప్పవి కాబట్టి సచిన్ టెండూల్కర్ కి ఫేవర్ గా అర్జున్ టెండూల్కర్ ని మనం టీంలోకి తీసుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశ్యంతో మాత్రం అతన్ని టీం లోకి తీసుకోలేదు. ఆయన ఎప్పుడైతే తన ప్రతిభను తను ప్రూవ్ చేసుకుంటాడో అప్పుడు ఆటోమేటిక్ గా తనే టీమ్ లోకి వస్తాడు అనేది వాస్తవం…
తిలక్ వర్మ లాంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్లేయర్ కూడా ఇంటర్నేషనల్ టీమ్ లో ఆడుతున్నాడు రిచ్ , పూర్ అనే భావాలను చూపిస్తూ బీసీసీఐ సెలక్షన్ చేయడం లేదు. బీసీసీఐకి ఆ ప్లేయర్ బ్యాటింగ్ లో అత్యధికంగా పరుగులు చేయగలడా లేదా బౌలింగ్ లో వికెట్లు తీసి టీమ్ ని విజయతీరాలకు చేర్చగలడా లేదా అనే ఉద్దేశ్యం తోనే ఆలోచిస్తుంది తప్ప ఇక్కడ వీళ్ళ నాన్న గొప్పోడు వీడు కూడా గొప్పోడు అవుతాడనే ఒక ఊహగానాలతో కానీ వీళ్ళకి డబ్బులు ఉన్నాయి సెలెక్ట్ చేస్తే మనకు డబ్బులు ఇస్తారు అనే ఒక చీప్ మెంటాలిటీతో బిసిసిఐ వ్యవహరించదు…
అంతెందుకు రింకు సింగ్ లాంటి ఒక ఫినిషర్ టీమ్ లో చోటు సంపాదించుకున్నాడు నిజానికి రింకు సింగ్ ఒక పేద ఇంటి కుర్రాడు అతను పెద్దగా చదువుకోలేదు కానీ తనకు క్రికెట్ అంటే ప్రాణం, పిచ్చి ఉండడంతో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక దాని ద్వారా ఆయన ఇంటర్నేషనల్ టీం కి ఎంట్రీ ఇచ్చాడు తనలో ఆడే సత్తా ఉంది ఇండియన్ టీమ్ ఫినిషర్ గా పక్కాగా పనిచేస్తాడని బీసీసీఐ అతన్ని నమ్మింది కాబట్టి అతను ఇండియన్ టీం కి సెలెక్ట్ అయి తన సేవలను అందిస్తున్నాడు. నిజానికి రింకు సింగ్ ఫ్యామిలీకి తను ఇంటర్నేషనల్ టీం కి సెలెక్ట్ అయ్యేంతవరకు కూడా ఒక పూట తినడానికి తిండి ఉంటే మరొక పూట తిండి ఉండకపోయేది కటిక పేదరికంలో నుంచి వచ్చిన ప్లేయర్ ని సైతం బిసిసిఐ తన టాలెంట్ ని ప్రోత్సహించి ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది.
ఇక రవీంద్ర జడేజా వాళ్ళ నాన్న వాచ్ మెన్ గా చేస్తున్నప్పుడు జడేజాకే క్రికెట్ అంటే ప్రాణం ఉండడంతో క్రికెట్ పైన ఇంట్రెస్ట్ పెట్టి ఐపీఎల్ లో తన సత్తా చాటుకుని ఇండియన్ టీం కి సెలెక్ట్ అయ్యాడు.వాచ్ మెన్ కొడుకు కదా తనను ఎందుకు సెలెక్ట్ చేయాలని బీసీసీఐ ఆలోచించలేదు తన తండ్రితో గాని, తన ఫ్యామిలీతో గానీ ఎలాంటి సంబంధం లేకుండా ఆ ప్లేయర్ పర్టికులర్ సిచువేషన్ లో మ్యాచ్ ని ఎలా డీల్ చేయగలడు, మ్యాచ్ ని గెలిపించే కెపాసిటీ ఆయనలో ఉందా అనేది చూసి బిసిసిఐ అతనికి అవకాశాలు కల్పించింది దాంతో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు…
ఇలా ఇండియన్ బోర్డ్ నిష్పక్షపాతంగా ఉంటుంది కాబట్టే మంచి ప్లేయర్లు ఇండియన్ టీమ్ లోకి వస్తున్నారు అందుకే ఇండియన్ టీమ్ ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ స్థానం లో కొనసాగుతుంది…క్రికెట్ లో ఇలాంటి ఒక గొప్ప వైఖరితో బిసిసిఐ అలవరుస్తు ముందుకు వెళ్తుంది దాంతో దేశంలోనే అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలుస్తుంది…
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Indian cricket team is leading the way for the country
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com