Border Gavaskar Trophy : వచ్చే ఏడాది లార్డ్స్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ జరుగుతాయి. ఇందులో పోటీ పడాలంటే టీమిండియా కచ్చితంగా ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో 4-0 తేడాతో విజయం సాధించాలి. లేదా 5-0 తేడాతో గెలుపును ఏకపక్షం చేసుకోవాలి.4-0 తేడాతో గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళుతుంది. 5-0 తేడాతో విజయం సాధిస్తే రెండవ మాటకు తావు లేకుండా, ఇతర జట్ల విజయాలతో సంబంధం లేకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి ప్రవేశిస్తుంది. అయితే న్యూజిలాండ్ జట్ట చేతిలో వైట్ వాష్ కు గురైన నేపథ్యంలో టీమిండియా ఆస్ట్రేలియాతో నవంబర్ 22 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్ కు దూరమయ్యాడు. దీంతో భారత జట్టును బుమ్రా నడిపించనున్నాడు. గిల్ ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడిన నేపథ్యంలో.. అతడికి బదులుగా ఓపెనర్ గా రాహుల్ ఆడనున్నాడు. యశస్వి జైస్వాల్ తో కలిసి భారత ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నాడు. వీరు మాత్రమే కాకుండా హర్షిత్ రాణా, ధృవ్ జూరెల్ వంటి వారు కూడా పెర్త్ టెస్టులో ఆడే అవకాశం ఉన్నట్టు జాతి మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. అయితే ఆస్ట్రేలియాపై టీమిండియా ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తే గెలుస్తుందనే దానిపై క్రికెటర్లు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. అందులో రవి శాస్త్రి కాస్త భిన్నంగా స్పందించాడు. టీమిండియా ఎలా చేస్తే విజయం సాధిస్తుందో గణాంకాలతో సహా వివరించాడు.
రవి శాస్త్రి ఏమంటున్నాడు అంటే
టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న నేపథ్యంలో.. ఆ సిరీస్ గెలవాలంటే టీమిండియా అనుసరించాల్సిన విధానాలను రవి శాస్త్రి వెల్లడించాడు.. ఒక జాతీయ మీడియా సంస్థతో ఆయన ఈ విషయాలను పంచుకున్నాడు. ” న్యూజిలాండ్ జట్టుతో వైట్ వాష్ కు గురైన తర్వాత టీమ్ ఇండియా పై ఒత్తిడి పెరిగిపోయింది. ఇది సహజమే. కాకపోతే టీమిండియా ఒత్తిడి నుంచి బయట పడాల్సిన అవసరం ఇది. వచ్చే ఏడాది లార్డ్స్ లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో అడుగు పెట్టాలంటే టీమిండియా ఈ సిరీస్ లో అద్భుతమైన ప్రతిభ చూపించాలి. 2018-19 కాలంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా గెల్చుకుంది. ఆ సమయంలో పూజార అద్భుతమైన సెంచరీ చేశాడు. అడిలైడ్ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో గెలిచింది. అప్పుడు విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్ గా ఉన్నాడు. ఇక అదే ఉత్సాహాన్ని టీమిండియా 2021 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ కొనసాగించింది. అప్పుడు జట్టులో కీలకమైన ఆటగాళ్లు లేరు. ఆస్ట్రేలియా మైదానాలు భారత ఆటగాళ్లకు కొత్త కాదు. ఈ మైదానాలలో పేస్ బౌలర్లు సత్తా చాటగలరు. రోజులు గడుస్తున్న కొద్ది స్పిన్ బౌలర్లు రెచ్చిపోగలరు. వైట్ బాల్ ఫార్మాట్ కు కొంతకాలంగా ఇండియన్ క్రికెటర్లు విపరీతంగా అలవాటు పడ్డారు. ఇప్పుడు రెడ్ బాల్ లోకి వచ్చారు కాబట్టి.. మొదట్లో ఇబ్బంది ఉంటే ఉండవచ్చు. కొంతకాలంగా ఆస్ట్రేలియా మైదానాలపై మన వాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఆ కాస్త ఇబ్బంది కూడా ఉంటుందని అనుకోను. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు టీమిండియాను బలోపేతం చేస్తుంది. బౌలింగ్ లోనూ అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. అయితే విజయం ఒకరి వల్ల దక్కదు కాబట్టి.. సమష్టి తత్వాన్ని అలపరుచుకుంటే ఆస్ట్రేలియాపై గెలవడం పెద్ద కష్టం కాదు. గత రెండు సీజన్లో టీమిండియా దానిని నిరూపించింది. ఈసారి కూడా పునరావృతం చేస్తే పెద్దగా ఇబ్బంది ఉండదని” రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Ravi shastris advice to team india to win against australia
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com