India Vs Australia 3nd Odi: ఇండియా vs ఆస్ట్రేలియా : అంతా ఇంటికెళ్లిపోయారు.. ఉన్న 13 మందిలో టీమిండియా ప్లేయింగ్ 11 ఇదీ

మూడో మ్యాచ్ లో సీనియర్ ప్లేయర్లు అయినా రోహిత్ శర్మ ,విరాట్ కోహ్లీ ,హార్దిక్ పాండ్యాలు టీంలోకి అందుబాటులో ఉంటారు. అయితే వీరి ముగ్గురు టీంలోకి రావడం ఇండియన్ టీమ్ కి మరింత బలాన్ని చేకూరుస్తుంది.

Written By: Gopi, Updated On : September 27, 2023 9:06 am

India Vs Australia 3nd Odi

Follow us on

India Vs Australia 3nd Odi: ఆస్ట్రేలియా ఇండియా మధ్య ఇవాళ్ల మూడోవ వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయిన కూడా పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే 2-0 తేడాతో ఆస్ట్రేలియా మీద ఇండియా సిరీస్ ని కైవసం చేసుకుంది. కాబట్టి ఈ మ్యాచ్ ఓడిపోయిన పెద్దగా ప్రాబ్లం అయితే లేదు అలాగే అసలు బీసీసీఐ ఈ మ్యాచ్ గురించి అనే కాదు అసలు ఈ సిరీస్ గెలిచిన, ఓడిన ప్రాబ్లం లేదనే ఉద్దేశంతోనే మొదటి రెండు మ్యాచ్ లకి యంగ్ ప్లేయర్స్ తో ఆడించడం జరిగింది. కానీ యంగ్ ప్లేయర్స్ కూడా చాలా బాగా ఆడి ఇండియాకి కప్పు తీసుకురావడం జరిగింది.

ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఇవాళ్ల జరిగే మూడో మ్యాచ్ లో సీనియర్ ప్లేయర్లు అయినా రోహిత్ శర్మ ,విరాట్ కోహ్లీ ,హార్దిక్ పాండ్యాలు టీంలోకి అందుబాటులో ఉంటారు. అయితే వీరి ముగ్గురు టీంలోకి రావడం ఇండియన్ టీమ్ కి మరింత బలాన్ని చేకూరుస్తుంది. అంటే ఈ ముగ్గురు టీమ్ లోకి వస్తున్నారు కాబట్టి ఇది ఒక పెద్ద మ్యాచ్ గా అయితే మారే అవకాశం ఉంది.ఇక దానికి తోడు అక్టోబర్ 8వ తేదీన వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ గా ఇండియా ఆస్ట్రేలియా తో తలపడనుంది. కాబట్టి ఈ మ్యాచ్ లో సీనియర్లు కూడా ఆడితే వాళ్ళకి కూడా కొంచం ప్రాక్టీస్ అయినట్టు గా ఉంటుంది. ఇక మొదటి రెండు మ్యాచ్ ల్లో అదరగొట్టిన శుభ్ మన్ గిల్ కి అతనితో పాటు బౌలర్ శార్దూల్ ఠాకూర్ కి కూడా ఈ మ్యాచ్ లో రెస్ట్ ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది.

ఈ మ్యాచ్ రాజ్ కోట్ లో ఆడుతున్నారు కాబట్టి ఇది బ్యాటింగ్ కి ఫ్రెండ్లీగా ఉండే పిచ్ కాబట్టి ఇక్కడ బ్యాట్స్ మెన్స్ విపరీతమైన పరుగులు చేయొచ్చు ఇంతకుముందు ఈ పిచ్ లో 400 రన్స్ కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. సెకండ్ బ్యాటింగ్ చేసి 400 ప్లస్ రన్స్ చేజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మాత్రం మరొకసారి పరుగుల వరద పరనున్నట్టు గా తెలుస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్, శార్దూల్ ఠాకూర్ ని పక్కన పెట్టడం వల్ల ఇండియాకి వచ్చే ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం… శుభ్ మన్ గిల్ ఈ మధ్య రెస్ట్ లేకుండా కంటిన్యూ గా మ్యాచ్ లు ఆడుతున్నాడు కాబట్టి ఈ మ్యాచ్ లో ఆయనకి రెస్ట్ ఇవ్వడం బెస్ట్…

ఎందుకంటే వరల్డ్ కప్ లో తను ఒక కీలక ప్లేయర్ కాబట్టి అతనికి రెస్ట్ ఇస్తేనే బెటర్ అతని ప్లేస్ లో ఓపెనర్ గా రోహిత్ శర్మ ఆడతాడు. కాబట్టి రోహిత్ శర్మ ఒక పెద్ద ప్లేయర్ ఆల్రెడీ ఫామ్ లో ఉన్న ప్లేయర్ కాబట్టి ఈ మ్యాచ్ లో ఆయన నుంచి మనం ఒక పెద్ద నాక్ అయితే ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. ఇక గిల్ కి ఈ మ్యాచ్ లో రెస్ట్ ఇవ్వడం వల్ల మళ్ళీ అతను ఫామ్ కోల్పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి అది కూడా మనవాళ్ళు జాగ్రత్త చూసుకోవాల్సి ఉంటుంది.ఇక స్పిన్నర్లు గా అశ్విన్ ఆడతాడు అలాగే రవీంద్ర జడేజా ఉంటాడు వీళ్లిద్దరి తో పాటు గా కుల్దిప్ యాదవ్ కూడా ఉంటాడు.ఇక అసలు విషయానికొస్తే సిరాజ్, బుమ్రా ఇద్దరూ ఉంటారు కాబట్టి ఈ మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లు,ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగనుందని తెలుస్తుంది.

ఇద్దరు పేసర్లకు తోడుగా హార్దిక్ పాండ్యా కూడా ఉంటాడు. కాబట్టి మొత్తం టీమ్ లో ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో ఇండియా ఈ మ్యాచ్ ఆడనుంది.బేసిగ్గా అయితే ఇద్దరు స్పిన్నర్లు చాలు కానీ 2017 లో అశ్విన్, జడేజా ఇద్దరు ఆడిన కూడా వాళ్ళిద్దరు పెద్దగా పెర్ఫార్మన్స్ అయితే చేయలేకపోయారు. దాంతో ఈ మ్యాచ్ లోకి ఎక్స్ట్రా గా కుల్దిప్ ని ఆడ్ చేసి దిగితే బెటర్ అని ఆయన్ని దింపుతున్నారు.ఇక ఇంకో విషయం ఏంటంటే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ గాని, విరాట్ కోహ్లీ గాని మరో సెంచరీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.కోహ్లీ ఒక సెంచరీ చేయగలిగితే 48 సెంచరీలు పూర్తవుతాయి.ఇక రోహిత్ శర్మ కూడా ఆస్ట్రేలియా మీద మంచి పర్ఫామెన్స్ అయితే ఇవ్వగలడు కాబట్టి అతని నుంచి మనం ఒక సెంచరీని ఎక్స్పెక్ట్ చేయవచ్చు…అయితే ఇక్కడ మన బౌలర్ లను ఈ మ్యాచ్ లో వార్నర్ గానీ, స్మిత్ గానీ చాలా ధాటిగా ఎదురుకునే ప్రమాదం అయితే ఉంది.

ముఖ్యంగా స్మిత్ అటు ఫస్ట్ బౌలర్లను, ఇటు స్ప్పినర్లను ధాటిగా ఎదురుకుంటాడు. కాబట్టి ఆయాన్ని కట్టడి చేయాలంటే కొంచం కష్టం అయినప్పటికీ కుల్దిప్ యాదవ్ గానీ, బుమ్రా గానీ అతన్ని తొందరగా ఔట్ చేస్తే పర్లేదు కానీ లేకపోతే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయగలదు…అలాగే ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిస్తే మొదట బౌలింగ్ తీసుకుంటే బెటర్…ఒకసారి ఇండియా ప్లేయింగ్ లెవన్ కనక చుసుకున్నటైతే…

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్,విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్,కే ఎల్ రాహుల్,సూర్య కుమార్ యాదవ్,రవీంద్ర జడేజా,రవిచంద్రన్ అశ్విన్, కుల్దిప్ యాదవ్,జస్ప్రుత్ బుమ్రా,మహమ్మద్ సిరాజ్..

ఇక ఏది ఏమైనా వరల్డ్ కప్ లో వచ్చే నెల ఎనిమిదవ తేదీన వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా ఒక మ్యాచ్ లో ఆస్ట్రేలియా తో తలపడనుంది కాబట్టి ఇది మనవాళ్ళకి ఒక వార్మప్ మ్యాచ్ లాంటిది…