https://oktelugu.com/

India Today Survey : తెలంగాణ ఎన్నికల ఫలితాన్ని తేల్చేసిన ‘ఇండియా టుడే’ సర్వే

ఈ సర్వే చూస్తుంటే కర్ణాటక ఫలితాల ఇంపాక్ట్‌ తెలంగాణపై పడుతుందని ఇండియా టుడే అంచనా వేసింది. ఇది ఎన్నికల నాటికి ఇంకా పెరొగొచ్చని భావిస్తోంది.

Written By: , Updated On : August 25, 2023 / 03:00 PM IST

India Today Survey : ఇండియా టుడే సర్వే సైతం మరోసారి మోడీదే విజయం అని స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు పార్లమెంటరీ ఎన్నికలు జరిగితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 306 సీట్ల మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంటుందని ఇండియా టుడే-సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ పేర్కొంది.

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 272ను ఎన్డీఏ అధిగమిస్తుందని సర్వే వెల్లడించింది. మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ ప్రకారం.. ఎన్‌డిఎ 306 సీట్లు గెలుస్తుందని, ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి 193 సీట్లు, ఇతర రాజకీయ పార్టీలు 44 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేసింది.

కొత్తగా ఏర్పాటైన ఇండియా కూటమికి అంచనా వేసిన సీట్ల వాటా భారీగా పెరిగింది. జనవరి సర్వేలో కూటమికి 153 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇప్పుడు ఆగస్ట్ లో చేసిన సర్వేలో సీట్ల వాటాను 193కు పెంచుకోవడం ప్రతిపక్షాలకు బలం చేకూరినట్టైంది.

తెలంగాణ ఎన్నికల రేసులో అందరికంటే ముందు ఉండాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఇండియా టుడే షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి మంచి ఊపు మీద ఉన్న బీఆర్‌ఎస్‌కు ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ తెలంగాణ సర్వే అంచనా ఆ ఉత్సాహాన్ని నీరుగార్చింది.

తాజా సర్వేలో కాంగ్రెస్‌కు ఎడ్జ్‌ వచ్చినట్లు ఇండియా టుడే తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలోని 19 లోక్‌సభ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ సీట్లు.. 9 నుంచి 6కు తగ్గుతాయని తెలిపింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ స్థానాలు 3 నుంచి 8కి పెరుగుతాయని తేల్చింది. ఇక బీజేపీ సీట్లలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం ఉన్న నాలుగు లోక్‌సభ స్థానాలను నిలబెట్టుకుంటుందని వెల్లడించింది.

తాజా ఇండియా టుడే సర్వే ఫలితాలు కాంగ్రెస్‌లో ఉత్సాహం నింపుతాయనడంలో సందేహం లేదు. ఇదే సమయంలో తాము ముందు ఉన్నామని పిస్తున్న బీఆర్‌ఎస్‌కు నిరుత్సాహం తప్పదు. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్న గులాబీ బాస్‌కు నిజంగా ఈ ఫలితాలు షాక్‌ అనే చెప్పాలి. ఇక బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని, దక్షిణాది నుంచి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని భావిస్తున్న బీజేపీకి కూడా తాజా ఫలితాలు ఇబ్బందికరమే. ఈ సర్వే చూస్తుంటే కర్ణాటక ఫలితాల ఇంపాక్ట్‌ తెలంగాణపై పడుతుందని ఇండియా టుడే అంచనా వేసింది. ఇది ఎన్నికల నాటికి ఇంకా పెరొగొచ్చని భావిస్తోంది.

ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో తెలంగాణలో ఫలితాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు. 

 

తెలంగాణ ఎన్నికల ఫలితాన్ని తేల్చేసిన 'ఇండియా టుడే' సర్వే | India Today Survey | Telangana | Ram Talk