India Port : రవాణా విషయంలో ఈ రోజుకు అధిక వ్యాపారం జరిగేది సముద్ర మార్గంలో, ఆ తర్వాత భూమార్గంలో. కాకపోతే భూమార్గంలో కొన్ని ఇబ్బందులున్నాయి. ఉదాహరణకు మనకు పాకిస్తాన్ తో సత్సంబంధాలు లేవు. అందువలన పాకిస్తాన్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, మధ్య ఆసియా లాంటి దేశాలకు మనం భూ భాగం ద్వారా రవాణా చేయలేము. అలాగే తూర్పున ఆగ్నేయాసియా కూడా భూ భాగం ద్వారా వ్యాపారం చేయలేకపోతున్నాం. దానికి ముఖ్యంగా అదునాతన రవాణా వ్యవస్థ లేకపోవడం. మరి ప్రత్యామ్నాయం ఏమిటి?
ఇప్పటివరకు మనకు ప్రధానంగా రెండే దారులున్నాయి. ఒకటి పశ్చిమ తీరం నుంచి హిందూమహాసముద్రం మీదుగా ఎర్రసముద్రం ద్వారా సూయెజ్ కాల్వ ద్వారా మధ్యధరా సముద్రం మీదుగా ; రెండోది, తూర్పు తీరంనుంచి మలక్కా జలసంధి ద్వారా. ఇవి రెండూ అతి రద్దీ మార్గాలు. ముఖ్యంగా సూయెజ్ కాల్వ మార్గం. ఉదాహరణకు యూరప్, రష్యాకి ఈ మార్గం నుంచే వెళ్ళాలి. చివరకు మనకు దగ్గరగా వున్న మధ్య ఆసియా కు కూడా. దీనివలన భారత్ వ్యాపారంలో వెనకబడుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రస్తుతం భారత్ రష్యా నుంచి క్రూడాయిల్ కొంటుంది. ఇది సెయింట్ పీటర్స్ బర్గ్ రేవు నుంచి భారత్ కు రావాలంటే దాదాపు 40 రోజులు పడుతుంది. బాల్టిక్ సముద్రం నుంచి ఇంగ్లీష్ ఛానల్ ద్వారా జిబ్రాల్టర్ జలసంధి దాటి మధ్యదరా సముద్రం, సూయెజ్ కాల్వ మీదుగా ఎర్ర సముద్రం దాటి హిందూమహాసముద్రం ద్వారా మన పశ్చిమ తీరం రావాలి.
మరి ఈ భారీ ఓడలు మనదేశంలో ఆగడానికి సరైన పోర్టులు లేవు. అందుకే అంతర్జాతీయ సరుకు రవాణా బదిలీ నౌకాశ్రయాలు భారత్ కు లేవన్నది వాస్తవం. మరి భారత్ లో అలాంటి పోర్టులు మోడీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. దీనివెనుక కారణాలు.. లాభాలపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.
