IND vs PAK : శుభ్ మన్ గిల్ జట్టులోకి వస్తే బలయ్యే ఆ ఆటగాడు ఎవరు? ఆ ఇద్దరిలో ఒకరు ఔట్?

ఇషాన్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ కూడా ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ లో డకౌట్ అయ్యారు. అప్ఘనిస్తాన్ తో రాణించారు.దీంతో వీరిద్దరిలో ఒకరిని బెంచ్ లో కూర్చోబెట్టడం కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ కు కష్టంగా మారింది. దీనిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

Written By: NARESH, Updated On : October 14, 2023 11:23 am
Follow us on

IND vs PAK : ఇండియా పాకిస్తాన్ హీట్ మొదలైంది. ఈరోజు వన్డే వరల్డ్ కప్ లోనే అతిపెద్ద సమరానికి అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియం సిద్ధమైంది. వాతావరణం బాగుండడంతో ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఊపేయడం ఖాయం. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం నరేంద్రమోడీ స్టేడియంలో లక్షా 30వేల మంది మధ్య మ్యాచ్ జరుగుతుండడంతో ఆ కోలాహలం చూసి తీరాల్సిందే.

రెండు శత్రుదేశాల మధ్య జరిగే ఈ అతిపెద్ద రైవర్లీని ఇండియా, పాకిస్తానీయులే కాదు.. ప్రపంచమంతా కూడా ఆసక్తిగా చూడబోతోంది. శనివారం స్టేడియంలో, ప్రపంచవ్యాప్తంగా దేశం నలుమూలలా చూసేందుకు అభిమానులు ఇప్పటికీ అన్నీ సిద్ధం చేసుకున్నారు.

అయితే సూపర్ ఫాంలో ఉన్న ప్రపంచంలోనే ర్యాంకింగ్స్ లో 2వ స్థానంలో ఉన్న శుభ్ మన్ గిల్ వన్డే వరల్డ్ కప్ వేళ డెంగ్యూ బారినపడ్డాడు. మొదటి రెండు మ్యాచ్ లకు దూరమయ్యారు. ఆసియాకప్ లో పాక్ పై, ఇతర మ్యాచ్ లలో వీర కొట్టుడు కొట్టి వరుస సెంచరీలతో సూపర్ ఫాంలో ఉన్న గిల్ దూరం కావడంతో టీమిండియా ఓపెనింగ్ గాడి తప్పింది. ఆస్ట్రేలియతో మ్యాచ్ లో మొదటి మూడు వికెట్లు 10లోపే ఔట్ అయిపోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఓపెనర్ గా వచ్చిన ఇషాన్ కిషన్ ఏమాత్రం ధాటిగా ఆడడం లేదు. బయడపడుతూ బ్యాటింగ్ చేశాడు.

ఇప్పుడు గిల్ డెంగ్యూ జ్వరం తగ్గి అహ్మదాబాద్ లో టీంతో చేరాడు. నిన్న ప్రాక్టీస్ చేశాడు. చురుకుగానే కనిపించాడు. ఈరోజు పాక్ తో కీలకమైన పోరులో ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. గిల్ ను ఆడిస్తే ఎవరిని పక్కన పెడుతారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇషాన్ కిషన్ ను పక్కన పెడుతారా? లే శ్రేయాస్ అయ్యార్ ను తప్పిస్తారా? అన్నది ఆసక్తి రేపుతోంది.

ఇషాన్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ కూడా ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ లో డకౌట్ అయ్యారు. అప్ఘనిస్తాన్ తో రాణించారు.దీంతో వీరిద్దరిలో ఒకరిని బెంచ్ లో కూర్చోబెట్టడం కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ కు కష్టంగా మారింది. దీనిపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

ఆసియాకప్ 2023లో పాక్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ కష్టాల్లో ఉన్న సమయంలో ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాటింగ్ తో ఆడుకుతున్నాడు. ప్రస్తుతం జట్టులో ఇషాన్ మాత్రమే స్పెషలిస్టు లెఫ్టాండ్ బ్యాటర్ గా ఉన్నాడు. ఒక వేళ ఇషాన్ ను తప్పిస్తే 6వ నంబర్ వరకూ అందరూ రైట్ హ్యాండర్లే. బ్యాటింగ్ లయ దెబ్బతింటుంది. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ ను కాకుండా శ్రేయాస్ అయ్యర్ ను తప్పించే అవకాశాలున్నాయి. ఇక శార్ధుల్ ఠాకూర్ ను ఆడిస్తారా? లేక షమీని తీసుకుంటారా? లేక శార్ధుల్ ప్లేసులో గిల్ ను తీసుకుంటారా? అన్నది కూడా ఆసక్తి రేపుతోంది.

మొత్తంగా ఈ మ్యాచ్ లో గిల్ వస్తే ఎక్కువగా శ్రేయాస్ అయ్యర్ నే బెంచ్ పై కూర్చోబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.