IND Vs ENG 1st Test: ఇండియా టార్గెట్ 231…వాళ్ళు రాణిస్తే ఈజీగా గెలవచ్చు…

ఇండియన్ బౌలర్ల ను ధాటిగా ఎదుర్కోవడం లో తడబడ్డప్పటికి వల్ల టీమ్ లో 'ఒళ్లై పోప్' అద్భుతమైన సెంచరీ చేసి ఇంగ్లాండ్ టీమ్ ని ఆదుకున్నాడు. ఇక 196 పరుగులు చేసిన పోప్ డబుల్ సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు.

Written By: Gopi, Updated On : January 28, 2024 12:12 pm
Follow us on

IND Vs ENG 1st Test: ఇండియా ఇంగ్లాండ్ టీమ్ ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగుతుంది. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ టీం 246 పరుగులు చేయగా, ఇండియా 436 పరుగులు చేసింది. ఇక మొదటి ఇన్నింగ్స్ ముగిసే సమయనికి ఇండియన్ టీమ్ 190 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక ఇలాంటి సమయం లో సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ టీమ్ చతికిల పడుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ మొదటి ఇన్నింగ్స్ తో పోల్చితే రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ కొంతవరకు పర్లేదు అనేలా అడారు.

ఇండియన్ బౌలర్ల ను ధాటిగా ఎదుర్కోవడం లో తడబడ్డప్పటికి వల్ల టీమ్ లో ‘ఒళ్లై పోప్’ అద్భుతమైన సెంచరీ చేసి ఇంగ్లాండ్ టీమ్ ని ఆదుకున్నాడు. ఇక 196 పరుగులు చేసిన పోప్ డబుల్ సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా తను బూమ్రా బౌలింగ్ లో అవుట్ అవడంతో ఇంగ్లాండ్ అభిమానులు తీవ్రమైన నిరాశకి గురయ్యారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ టీం 420 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. అయినప్పటికీ ఇంగ్లాండ్ టీమ్ ఫస్ట్ ఇన్నింగ్స్ తో పోల్చుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ లో కొంతవరకు బాగానే ఆడింది.ఇక ఇండియా ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే 231 పరుగుల లక్ష్యాన్ని చేదించాల్సి ఉంది.

ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఇండియన్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా బుమ్ర నాలుగు వికెట్లు తీసి, ఇంగ్లాండ్ టీమ్ భారీ స్కోర్ చేయకుండా నియంత్రించగలిగాడు. అలాగే రవిచంద్రన్ 3 వికెట్లు, రవీంద్ర జడేజా 2 , అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. ఇక ఇంగ్లాండ్ టీం ప్లేయర్ల లో ఎవరు పెద్దగా ఆడనప్పటికీ పోప్ ఒక్కడే 196 పరుగులు చేయడం వల్ల ఆ టీమ్ కి భారీ స్కోర్ దక్కింది…ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో బరిలోకి దిగుతున్న ఇండియన్ టీం ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 231 పరుగులు పెద్ద భారీ స్కోర్ అయితే కాదు. ఇండియన్ టీమ్ ఈజీగా ఈ స్కోర్ ను చేదించవచ్చు. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించాలంటే మాత్రం ముందుగా మన ఓపెనర్లు చాలా స్ట్రాంగ్ గా ఆడాల్సిన అవసరమైతే ఉంది.

ఫస్ట్ ఇన్నింగ్స్ లో మాదిరిగానే జైస్వాల్ మరొకసారి రాణిస్తే ఈ మ్యాచ్ లో ఇండియా ఈజీగా గెలుస్తుంది. అలాగే కెఎల్ రాహల్, శ్రేయస్ అయ్యర్ లాంటి వారు మిడిల్ ఆర్డర్ లో కొంచెం స్ట్రాంగ్ గా నిలబడినట్లైతే ఈ స్కోర్ ని ఇండియా ఈజీగా కొట్టేస్తుంది. అలాగని ఇంగ్లాండ్ బౌలర్లను మనం తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు, వాళ్ళు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక ఇవాళ్ళ 4 వ రోజే కాబట్టి ఇవాళ్ళ ఇంకా ఆడే టైమ్ ఉంది. అలాగే రేపు కూడా సమయం ఉంది. కాబట్టి మన ప్లేయర్లు స్లో గా ఆడి ఈ మ్యాచ్ ను గెలిపించాలని ఇండియా టీమ్ అభిమానులందరు కోరుకుంటున్నారు…