Shreyas Iyer: అయ్యర్ పరిస్థితి ఏంటి అన్నారు కట్ చేస్తే సెంచరీ కొట్టాడు…

అలాగే గిల్ కూడా అయ్యర్ కి సపోర్ట్ చేస్తూ ఇద్దరూ ఒక లాంగ్ ఇన్నింగ్స్ అడుతు వికెట్ ఇవ్వకుండా చాలా జాగ్రత్త పడుతూ ఆడారు ఈ క్రమంలో అయ్యర్ ఒక భారీ సెంచరీ చేశాడు.

Written By: Gopi, Updated On : September 24, 2023 6:04 pm

Shreyas Iyer

Follow us on

Shreyas Iyer:  ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ తీసుకుంది దాంతో టాస్ ఓడిపోయిన ఇండియా బ్యాటింగ్ కి వచ్చింది.మన ఓపెనర్లు అయినా శుభ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కూడా కూడా మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ రుతురాజ్ గైక్వాడ్ ఎనిమిది పరుగులు మాత్రమే చేసి హాజిల్ వుడ్ బౌలింగ్ లో కీపర్ క్యాచ్ ఇచ్చి ఉంటాడు. దాంతో క్రీజ్ లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ నిదానంగా మ్యాచ్ ఆడుతూ గిల్ తో కలిసి వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ వచ్చాడు.

అలాగే గిల్ కూడా అయ్యర్ కి సపోర్ట్ చేస్తూ ఇద్దరూ ఒక లాంగ్ ఇన్నింగ్స్ అడుతు వికెట్ ఇవ్వకుండా చాలా జాగ్రత్త పడుతూ ఆడారు ఈ క్రమంలో అయ్యర్ ఒక భారీ సెంచరీ చేశాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లు అందరిని కూడా చితక్కొడుతు ఆయన ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడం ఒక వంతుకు ఇండియన్ క్రికెట్ టీం కి చాలా ప్లస్ అయిందని చెప్పాలి. ఇక వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో బెంచ్ కి పరిమితమైన ప్లేయర్లందరినీ పరీక్షించాలనే ప్రయత్నంలో వీళ్ళందర్నీ ఆడించడం జరుగుతుంది. మొదటి మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేసి సక్సెస్ అయితే ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేసి డబల్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

ఇక ఈ మ్యాచ్ లో తన విశ్వ రూపాన్ని చూపిస్తూ అయ్యర్ తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.ఇక నెంబర్ త్రీ లో వచ్చి ఒక పెద్ద ఇన్నింగ్స్ అడ్డం అనేది మామూలు విషయం కాదు.కానీ అయ్యర్ ఎక్కడ తడబడకుండా చివరి వరకు చాలా బాగా ఆడుతూ వచ్చాడు. ఇక సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్ 90 బంతుల్లో 105 పరుగులు చేసి అబౌట్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అయ్యర్ ఔట్ అయ్యాక గిల్ కూడా సెంచరీ చేసి అతను కూడా మంచి ఫామ్ లో ఉన్న ప్లేయర్ గా ఈ మ్యాచ్ లో తన ఫామ్ ని కంటిన్యూ చేశాడు…