ఏప్రిల్ నుంచి ఆదాయపు పన్నులో కొత్త నిబంధనలివే..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆదాయపు పన్ను నిబంధనలకు సంబంధించి కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. 2021 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఆదాయపు పన్ను చెల్లించే వాళ్లు ఈ నిబంధనల గురించి అవగాహన ఏర్పరచుకుంటే ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడవచ్చు. నూతన నిబంధనల ప్రకారం 75 సంవత్సరాల వయస్సు పైబడిన సీనియర్ సిటిజన్లకు పెన్షన్ నుంచి వచ్చే ఆదాయం,అదే బ్యాంకులో […]

Written By: Navya, Updated On : March 16, 2021 11:41 am
Follow us on

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆదాయపు పన్ను నిబంధనలకు సంబంధించి కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. 2021 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఆదాయపు పన్ను చెల్లించే వాళ్లు ఈ నిబంధనల గురించి అవగాహన ఏర్పరచుకుంటే ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడవచ్చు. నూతన నిబంధనల ప్రకారం 75 సంవత్సరాల వయస్సు పైబడిన సీనియర్ సిటిజన్లకు పెన్షన్ నుంచి వచ్చే ఆదాయం,అదే బ్యాంకులో స్థిర డిపాజిట్ నుంచి వచ్చే వడ్డీపై ఏప్రిల్ 1 నుంచి ఐటిఆర్ దాఖలు నుంచి మినహాయింపు ఉంటుంది.

Also Read: క్రిప్టో కరెన్సీపై కేంద్రం నిషేధం విధించనుందా..?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐటీఆర్ దాఖలు చేయని వాళ్ల కోసం అధిక టీడీఎస్ కు సంబంధించి ప్రతిపాదనలు చేయడం గమనార్హం. ఈపిఎఫ్ ఖాతాలో సంవత్సరానికి రెండున్నర లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేసే ఖాతాలపై పన్ను విధించాలని కీలక ప్రకటన చేశారు. అయితే కేంద్రం ఎంత మొత్తం పన్ను విధిస్తుందనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ నిర్ణయం వల్ల సాధారణ ఈపీఎఫ్‌ కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలగదని కేంద్రం చెబుతోంది.

Also Read: ఇంటర్ విద్యార్థులకు రూ.80,000 స్కాలర్ షిప్ పొందే ఛాన్స్..?

కేంద్రం ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయని వాళ్ల కోసం టీడీఎస్, టీసీఎస్‌ల‌ అధిక రేట్లు విధించడానికి సిద్ధమైంది. ఇందుకోసం కేంద్రం 206 ఎబి, 206 సిసిఎ నిబంధనలలో మార్పులు చేసింది. సీనియర్ సిటిజన్లకు పన్ను భారం తగ్గించడానికి కేంద్రం ఐటీఆర్ దాఖలు విషయంలో మినహాయింపులు కల్పిస్తోంది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ముందుగానే ఫిల్ చేసిన ఆదాయపు పన్ను రిటర్నులను పంపిణీ చేయనుంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

కేంద్ర ప్రభుత్వం సెలవు ప్రయాణ రాయితీకి బదులుగా నగదు భత్యానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని బడ్జెట్ లో ప్రతిపాదనలు చేసింది. కరోనా నిబంధనల వల్ల సెలవు ప్రయాణ రాయితీ పొందలేని వాళ్ల కోసం కేంద్రం ఈ నిబంధనలను అమలు చేస్తోంది