బేకింగ్ సోడా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?

మనం నిత్యం బేకరీ ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే వాటిలో బేకింగ్ సోడా ఒకటనే సంగతి తెలిసిందే. స్వీట్స్, కేకుల తయారీలో ఎక్కువగా ఉపయోగించే బేకింగ్ సోడా వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బేకింగ్ సోడా హ్యాండ్ వాష్ గా కూడా పని చేస్తుంది. చేతులు మురికిగా ఉంటే శుభ్రం చేసుకోవడం కొరకు బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. స్నానం చేసే నీళ్లలో కొద్దిగా బేకింగ్ సోడాను వేస్తే చర్మం మృదువుగా మారుతుంది. Also Read: అరికాళ్ల మంటలకు […]

Written By: Navya, Updated On : March 23, 2021 10:48 am
Follow us on

మనం నిత్యం బేకరీ ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే వాటిలో బేకింగ్ సోడా ఒకటనే సంగతి తెలిసిందే. స్వీట్స్, కేకుల తయారీలో ఎక్కువగా ఉపయోగించే బేకింగ్ సోడా వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బేకింగ్ సోడా హ్యాండ్ వాష్ గా కూడా పని చేస్తుంది. చేతులు మురికిగా ఉంటే శుభ్రం చేసుకోవడం కొరకు బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. స్నానం చేసే నీళ్లలో కొద్దిగా బేకింగ్ సోడాను వేస్తే చర్మం మృదువుగా మారుతుంది.

Also Read: అరికాళ్ల మంటలకు సులువుగా చెక్ పెట్టే చిట్కాలివే..?

కొంతమందికి చెమట ఎక్కువగా పట్టడం వల్ల వాళ్ల శరీరం నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఈ సమస్యతో బాధ పడేవాళ్లు బేకింగ్ సోడా, నీళ్లు కలిపిన మిశ్రమాన్ని చెమట ఎక్కువగా పట్టే ప్రాంతంలో ఉంచితే దుర్వాసన దూరమవుతుంది. మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ ను తగ్గించడంలో బేకింగ్ సోడా సహాయపడుతుంది. శరీరంలో మృతకణాలను తొలగించుకోవడంలో బేకింగ్ సోడా తోడ్పడుతుంది.

Also Read: మధుమేహం ఉన్నవారికి ఏ రైస్ మంచిదో తెలుసా..?

చర్మాన్ని అందంగా మెరిసేలా చేయడంలో కమలా పండ్ల రసం సహాయపడుతుంది. చర్మం జిడ్డుగా మారకుండా చేయడంలో బేకింగ్ సోడా తోడ్పడుతుంది. గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా కలిపి ఆ నీటిని పుక్కలిస్తే గొంతు సంబంధిత సమస్యలు దూరమవుతాయి. గ్లాసు నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి తాగితే కిడ్నీలోని రాళ్లు కరిగే అవకాశం ఉంటుంది. పాదాల నొప్పులు, వాపులు తగ్గించడంలో బేకింగ్ సోడా సహాయపడుతుంది.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

ఉదయం సమయంలో గ్లాస్ నీటిలో బేకింగ్ పౌడర్ వేసి తాగితే శరీరంలో కొవ్వు సులభంగా కరుతుంది. గ్యాస్, అసిడిటీ వంటి సమస్యల నివారణలో బేకింగ్ సోడా సహాయపడుతుంది. కడుపులోని ఆమ్లాలను బ్యాలెన్స్ చేయడంలో బేకింగ్ సోడా తోడ్పడుతుంది.