Telangana Assembly Elections 2023: అభ్యర్థుల లిస్టులు బయటకు వస్తేనే తెలంగాణలో క్లారిటీ

అభ్యర్థుల లిస్టులు బయటకు వస్తేనే తెలంగాణలో క్లారిటీ రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పరిస్థితులపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : October 19, 2023 5:24 pm

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రంజుగా మారుతున్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిన్న ములుగు వచ్చి ఒక బహిరంగ సభ పెట్టి వారి గ్యారెంటీలు చెప్పారు. కుల చిచ్చు రగిల్చాలని చూశారు. కుల తెలంగాణ, దొరల తెలంగాణ అంటూ ప్రజల మధ్య విద్వేషాలు పెంచే పనిలో కాంగ్రెస్ నేతలు పడ్డారు.

నేను జంగూ బ్రాహ్మణుడిని అని గుజరాత్ ఎన్నికల్లో చెప్పిన రాహుల్ గాంధీ, నేడు బలుగు బలహీన వర్గాల ప్రతినిధిని అంటూ చెప్పుకొస్తున్నాడు. మీరు నిజంగా తెలంగాణలో దొరల పాలన ఉందని ఆరోపించాడు. ప్రజల పరిపాలన అందిస్తానని అంటున్నాడు. నిజంగా తెలంగాణలో బీసీలపై అంత ప్రేమ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసేసి ‘ఓటుకు నోటు కేసులో’అడ్డంగా దొరికిన మరో రెడ్డి అయిన రేవంత్ ను ఎలా పీసీసీ చీఫ్ ను రేవంత్ చేశాడో చెప్పాలి.

కర్ణాటకలో రెడ్ల మహాసభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘పాలించేవాళ్లు అంతా రెడ్డీలే ఉండాలంటూ’ మాట్లాడిన తన కుల ఆధిపత్యపు పోకడలను బయటపెట్టాడు. ఇంత అగ్రకుల ఆధిపత్యం ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తెలంగాణలో బడుగు బలహీన వర్గాలగురించి మాట్లాడుతున్నారు.

అభ్యర్థుల లిస్టులు బయటకు వస్తేనే తెలంగాణలో క్లారిటీ రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ పరిస్థితులపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.