గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అపార్ట్‌మెంట్లలో నివాసముంటున్న వారికి ప్రతి ఇంటికీ నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటిని అందిస్తామంటూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం హామీనిచ్చింది. అపార్ట్‌మెంట్ ఫ్లాట్లకు కూడా ఇది వర్తింపజేయాలని నిర్ణయించింది. ఒక అపార్ట్‌మెంట్‌లో ఎన్ని ఇళ్లు ఉంటే.. అన్ని కుటుంబాలకు ప్రతినెలా 20 వేల లీటర్ల చొప్పున ఉచిత నీటిని అందించనుంది. నీటి వాడకం 20 వేల లీటర్లు దాటితే.. అదనంగా వాడుకున్న నీటికి ప్రస్తుతం అమల్లో ఉన్న చార్జీలను వసూలు చేస్తారు. ఇందుకోసం నల్లా కనెక్షన్ ఉన్న ప్రతి ఫ్లాట్ యజమాని సొంతంగా వాటర్ మీటర్‌ను బిగించుకోవాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పుడు తాజాగా జలమండలి అపార్ట్‌మెంట్ వాసులకు ‘జల’క్ ఇచ్చింది.
Also Read: కడపలో జగన్‌కు షాక్ : టీడీపీ మద్దతుదారుల విజయం
ఉచిత మంచినీటి పథకంలో అపార్ట్‌మెంట్లకు తాజాగా కొత్త నిబంధనలు చేర్చాలని నిర్ణయించింది. ఇప్పటివరకుఅపార్ట్‌మెంట్‌లో ఏదైనా ఒక్క ఫ్లాటు యజమాని ఆధార్‌ను జలమండలి క్యాన్‌తో లింకు చేస్తే సరిపోయేది. దీంతో అదే అపార్ట్‌మెంట్‌లో మిగతా ఫ్లాట్లకూ ఉచిత నీటి పథకాన్ని వర్తింపజేయాలనుకున్నారు. తాజాగా ఈ నిబంధనను మార్చుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధార్ మార్గదర్శకాలను అనుసరించి ప్రయోజనం పొందే ప్రతి లబ్ధిదారుడి ఆధార్‌ను అనుసంధానం చేయాల్సి ఉండడంతో కొత్తగా మార్పులు తప్పడం లేదని అధికారులు అంటున్నారు.
దీనిప్రకారం అపార్ట్‌మెంట్లలో ప్రతి ఫ్లాట్ యజమాని తన ఆధార్ లింక్ చేసి వేలిముద్ర వేయాలి. దీంతో పలు సమ్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక అపార్ట్‌మెంట్‌లో 100 ఫ్లాట్లు ఉన్నాయనుకుంటే.. అప్పుడు ప్రతి ఫ్లాట్ యజమాని తన ఆధార్‌ను జలమండలి క్యాను నంబర్‌కు లింకు చేయాలి. అంతేకాక వేలిముద్ర కూడా వేయాలి. అప్పుడే సదరు అపార్ట్‌మెంట్‌లోని అన్ని ఫ్లాట్లకు ఉచిత నీరు ఇస్తారు.
Also Read: చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు
ఒకవేళ ఆ 100 ఫ్లాట్లలో వివిధ కారణాలతో 10 మంది అందుబాటులో లేకుంటే వారు తప్పనిసరిగా ప్రతినెలా బిల్లు చెల్లించాల్సిందే. ఎందుకంటే ప్రతి అపార్ట్‌మెంట్‌కు ఏక మొత్తంలో మంచినీటిని సరఫరా చేస్తుంటారు. వ్యక్తిగతంగా కాకుండా అన్ని ఇళ్లకు కలిపి ఒకటే నీటి బిల్లు ఇస్తారు. నిర్వహణ వ్యయం నుంచి నీటి బిల్లులు ఎవరు చెల్లిస్తారనేది సమాధానం లేని ప్రశ్న. నెలనెలా నిర్వహణ వ్యయం కడుతూ ఆధార్ లింకు కాలేదని అదనంగా నీటి బిల్లూ చెల్లించాలంటే పెద్ద సమస్యే. అయితే.. వంద మంది యజమానులు ఒకేసారి వేలిముద్ర వేయడం, ఆధార్ లింక్ చేయడం కుదరకపోతే ఎవరికి వీలైనప్పుడు లింకు చేసే అవకాశం ఉందా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో మరింత స్పష్టత రానుంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్