Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో కత్తిపూడి సభతో ‘వారాహి విజయ యాత్ర’ ని ఘనంగా ప్రారంభించారు. మొదటి మూడు రోజులు ఈ వారాహి యాత్రకి అనూహ్యమైన స్పందన లభించింది. ఇది వరకు జనసేన పార్టీ నిర్వహించిన సభలు , యాత్రలకు ఎన్నడూ రాని రెస్పాన్స్ ఈ వారాహి యాత్ర కి వస్తోంది.
పవన్ కళ్యాణ్ తన ప్రసంగాలను మరింత పదును పెట్టి, ఆవేశంతో మాత్రమే కాకుండా ఆలోచనతో మాట్లాడుతూ, రాష్ట్రం వైసీపీ ప్రభుత్వం వల్ల ఎదురుకుంటున్న సమస్యల గురించి, అరాచకాల గురించి పూస గుచ్చినట్టుగా వివరిస్తూ జనాల్లో పరివర్తన పెంచుతున్నాడు. ఆయన ప్రసంగాలకు రీసెంట్ సమయం లో ఇతర హీరోల అభిమానుల నుండి కూడా అద్భుతమైన స్పందన లభిస్తుంది. కచ్చితంగా ఒక్క అవకాశం పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలి, ఈసారి మా వోట్ ఆయనకే, కుటుంబ సభ్యులతో కూడా ఓట్లు వెయ్యిస్తాము అని అంటున్నారు.
ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఈమధ్య కాలం లో టాలీవుడ్ స్టార్ హీరోల పేర్లను ప్రస్తావిస్తూ, వాళ్ళ ఓట్లు కూడా అడగడం, ఆయా హీరోల అభిమానులకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఈరోజు జరిగిన కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘సినిమాల పరంగా మీరు ఎంత మంది హీరోలను అయినా అభిమానించొచ్చు, కానీ రాజకీయాల్లో సరైన నాయకుడిని ఎంచుకునే విషయం అందరూ ఒక్క తాటిపైకి వచ్చి ఓట్లు వెయ్యాలి. మహేష్ బాబు అభిమానులకు, ప్రభాస్ అభిమానులకు , రామ్ చరణ్ అభిమానులకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు , చిరంజీవి అభిమానులకు మరియు రవితేజ అభిమానులకు ఒక్కటే చెప్తున్నాను. వారందరూ నాకు ఇష్టమే, మేమంతా కలిస్తేనే చిత్ర పరిశ్రమ. ఒక్కసారి జనసేనకు అండగా నిలబడండి, భవిష్యత్తు కోసం అడుగెయ్యండి ‘ అంటూ పవన్ కళ్యాణ్ అడగడం అందరినీ ఎంతో సంతోషానికి గురి చేసింది. ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన దీని గురించే మాట్లాడుకుంటున్నారు నెటిజెన్స్.
సినిమా వేరు .. రాజకీయం వేరు
అర్దంచేసుకోండి తెలుసుకోండి#VarahiVijayaYatra @PawanKalyan pic.twitter.com/1I5ZC2CDM7— Pawanism Network (@PawanismNetwork) June 18, 2023