Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘వారాహి విజయ యాత్ర’ ఎట్టకేలకు ఈమధ్యనే ఉభయగోదావరి జిల్లాల్లో ప్రారంభమై అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంటూ ముందుకు పోతున్న సంగతి అందరికీ తెలిసిందే. కత్తిపూడి సభ తో ప్రారంభమైన వారాహి యాత్ర , పిఠాపురం మీదుగా నేడు కాకినాడ కి చేరుకుంది.
ఈ మూడు ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ సభలు నిర్వహించే ఒక్క రోజు ముందు ఆ ప్రాంతం లో వివిధ రంగాలకు చెందిన వారితో చర్చలు జరుపుతూ, వారి నుండి సలహాలు తీసుకొని, ఆ తర్వాత జనవాణి కార్యక్రమాలను నిర్వహించి స్థానిక ప్రజల నుండి సమస్యలను తెలుసుకుంటూ, వారి నుండి వినతి పత్రాలు సేకరిస్తున్నాడు. ఆ సేకరించిన వినతి పాత్రలను ఆధారంగా చేసుకొని ఆయన బహిరంగ సభలో గొంతెత్తి ప్రభుత్వాధికారులను నిలదీస్తున్నాడు. ఇక నేడు కాకినాడ సభలో ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి ని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆయన మాట్లాడుతూ ‘ ఈ కాకినాడ MLA ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి, వాళ్ళ పార్టీ అధికారం లోకి వచ్చిందనే గర్వం తో 151 మంది గెలిచారని అహంకారం తో, ఈ పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, ఆయన ఇక ఏమి పీకుతాడులే అని తలబిరుసుతో , నోటికి వచ్చినట్టుగా అసభ్య పదజాలం ఉపయోహించాడు. అతను నన్ను అన్ని మాటలు అన్నా కూడా నాకేమి కోపం రాలేదు. కానీ నన్ను అన్నందుకు మన జనసైనికులు, వీరమహిళలు అతని ఇంటి ముందుకెళ్లి ధర్నా చేసారు.అప్పుడు ఈ డెకాయిట్ చంద్ర శేఖర్ రెడ్డి తన గూండాలతో మా ఆడపడుచూలాలపై దాడి చేయించి , వాళ్ళను కులం పేరుతో చాలా నీచంగా దూషించాడు. ఇంకొక్కసారి నువ్వు అలా ప్రవర్తిస్తే, నాదైన రోజు ఒకటి వస్తుంది, గతం లో మీ తాత ని TP నాయక్ అనే SI ఇలాగే రౌడీయిజం చేస్తే జీపు వెనకాల కట్టేసి రోడ్డు మొత్తం పరిగెత్తించాడు.ఆ రోజు మీ తాత TP నాయక్ దెబ్బ రుచి చూస్తే, నేను నీకు భీమ్లా నాయక్ దెబ్బ రుచి చూపిస్తాను’ అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
