https://oktelugu.com/

Rakesh Master Passes Away : రాకేష్ మాస్టర్ కి తలకొరివి పెట్టేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరా..! పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు!

చనిపోయిన తర్వాత నాలుగు కన్నీటి బోట్లని కార్చేందుకు , కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా లేరు. కేవలం ఆయనతో ఇన్ని రోజులు ప్రయాణం చేసిన కొరియోగ్రాఫర్స్ , శిష్యులు , అభిమానులు ఒక్కటే ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 18, 2023 / 08:48 PM IST
    Follow us on

    Rakesh Master Passes Away : సోషల్ మీడియా లో మీమ్స్ ద్వారా ఒక రేంజ్ లో పాపులారిటీ ని సంపాదించిన రాకేష్ మాస్టర్ , కాసేపటి క్రితమే మృతి చెందిన సంఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ లో ఎంతో మంది స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ శిష్యరికం లో ప్రస్తుతం ఇండియా మొత్తం మోస్ట్ డిమాండ్ ఉన్న కొరియోగ్రాఫర్స్ గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్ మరియు జానీ మాస్టర్ వచ్చారు.

    ఈ ఇద్దరు కొరియోగ్రాఫర్స్ లేనిదే ఇప్పుడు మన స్టార్ హీరోలు సినిమాలు చేయడం లేదు. వాళ్ళు ఆ స్థాయికి చేరుకోవడానికి కారణం రాకేష్ మాస్టర్ అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలను చూస్తూ ఇంతదూరం వచ్చిన రాకేష్ మాస్టర్ కి పాపం కుటుంబం అనేదే లేకపోవడం ఎంతో విచారకరం అని చెప్పాలి.

    ఆయన చనిపోయిన తర్వాత నాలుగు కన్నీటి బోట్లని కార్చేందుకు , కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా లేరు. కేవలం ఆయనతో ఇన్ని రోజులు ప్రయాణం చేసిన కొరియోగ్రాఫర్స్ , శిష్యులు , అభిమానులు ఒక్కటే ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవ్వరూ లేరు కదా, ఆయనకి తలకొరివి ఎవరు పెడుతారు అనే సందేహం మీలో రావొచ్చు.

    ఆయన మొదటి నుండి ఎంతో ప్రేమగా చూసుకునే శిష్యులలో ఎవరో ఒకరు ఆయనకి తలకొరివి పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ లోని తన సొంత నివాసానికి తరలించనున్నారని, రేపు అయ్యానని కడసారి చూసేందుకు తెలుగు సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులందరూ హాజరయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.