https://oktelugu.com/

Hyderabad Tourism: హైదరాబాద్ లో ఉల్లాసంగా గడిపే ప్రదేశాలు ఏవో తెలుసా?

ప్రపంచంలో హైదరాబాద్ ప్రత్యేకమైంది. దినదినాభివృద్ధి చెందుతూ దేశంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. నగరానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : January 27, 2024 / 04:58 PM IST
    Follow us on

    Hyderabad Tourism: ప్రస్తుతం ఎగ్జామ్ ఫీవర్ మొదలైంది. వరుసబెట్టి ఏప్రిల్ వరకు అన్ని తరగతులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తరువాత సెలవులు వస్తాయి. కొందరు సెలవుల్లోనూ ప్రత్యేక కోచింగ్ లు తీసుకుంటారు. మరికొందరు ఏదైనా నేర్చుకుంటారు. కానీ కొందరు విహార యాత్రలకు వెళ్లాలని అనుకుంటారు. అయితే చాలా మందికి మనసుకు ఉల్లాసాన్ని అందించే ప్రదేశాలకు వెళ్లాలని ఉంటుంది. కానీ సూదూరం వెళ్లడానికి ఇష్టపడరు. దగ్గర్లోనే మంచి ప్రదేశం ఉంటే అక్కడికి వెళ్లడానికి ఇష్టపడుతారు. ఈ నేపథ్యంలో తక్కువ సమయంలో అందమైన ప్రదేశాలకు వెళ్లాలంటే ఇవి తెలుసుకోండి..

    ప్రపంచంలో హైదరాబాద్ ప్రత్యేకమైంది. దినదినాభివృద్ధి చెందుతూ దేశంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. నగరానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఏదో ఒక పనిమీద రాజధానికి వస్తుంటారు. ఈ క్రమంలో ఉల్లాసంగా గడపాలని అనుకుంటారు. అయితే తక్కువ సమయంలో మంచి ప్రదేశాలు చూడడానికి అనువైన నగరం హైదరాబాద్. ఇక్కడున్న ఈ ప్రదేశాలను చూసి ఆనందించవచ్చు.

    హైదరాబాద్ లోని హుస్సాన్ సాగర్ గురించి తెలియని వారుండరు. దీని పక్కన కాసేపు నిలుచున్నా ఎంతో హాయిగా ఉంటుంది. అయితే ఇక్కడికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇక్కడ లేక్ ఫ్రంట్ పార్క్ ను నిర్మించారు. ఇది 10 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 500 మీటర్ల చొప్పున రెండు ట్రాక్ లు ఉన్నాయి. వీటిపై నడుస్తూ హుస్సేన్ సాగర్ ను చూస్తే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 5.30 గంటల నుంచి 11.30 గంటల వరకు తెరుస్తారు.

    నగరంలోని మరో ప్రదేశం సోలార్ సైకిల్ ట్రాక్. రింగ్ రోడ్డు వెంబడి 23 కిలోమీటర్ల వరకు ఉన్న ఈ ట్రాక్ పై సైక్లింగ్ చేయొచ్చు. మధ్య మధ్యలో ట్రాక్ పై సైకిల్ పార్కింగ్, ఫుడ్ స్టాల్స్, రెంటల్ స్టేషన్లు ఉంటాయి. విశ్రాంతి తీసుకోవడానికి గదులు కూడా ఉంటాయి. హైదరాబాద్ లో మంచి బెస్ట్ ప్లేస్ దుర్గం చెరువు మ్యూజికల్ ఫౌంటెయిన్. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు ఇక్కడికి రావొచ్చు. సాయంత్రం 7 నుంచి 10 గంటల వరకు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు.