INDIA Alliance : ఇండీ కూటమిని దెబ్బతీస్తున్న పార్టీలు, వ్యక్తులు, అంశాలు

డీఎంకే మంత్రుల దారుణాతిదారుణ వ్యాఖ్యలు ఇండియా కూటమికి పెద్ద దెబ్బగా మారింది. ఉత్తర భారతంలో ఇండియా కూటమికి జనాలను దూరమవుతున్నారు.

Written By: NARESH, Updated On : September 13, 2023 2:58 pm

INDIA Alliance : ఈరోజు ‘ఇండియా’ కూటమి మీటింగ్ న్యూఢిల్లీలో జరుగుతోంది. ప్రధానంగా సీట్ల పంపిణీ మీదనే ఈ చర్చ సాగుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి ఏ రాష్ట్రంలో ఏ విధంగా సీట్ల పొత్తులు కుదుర్చుకోవాలనే దానిపైనే సమావేశం జరుగుతోంది.

ఇండియా కూటమి సమస్యలు ఏమిటీ? అవరోధాలు, సీట్ల పంపిణీ ఎలా ఉండబోతోందన్నది కూలంకషంగా చర్చించుకుందాం. ఇండియా కూటమి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే ‘డీఎంకే’. కరెక్ట్ గా చెప్పాలంటే ‘డీఎంకే’ను బయటకు పంపించలేరు. డీఎంకేను లోపల పెట్టుకుంటే ఎన్నికల ఫలితాలు తారుమరయ్యే అవకాశం కనిపిస్తోంది.

డీఎంకే మంత్రుల దారుణాతిదారుణ వ్యాఖ్యలు ఇండియా కూటమికి పెద్ద దెబ్బగా మారింది. ఉత్తర భారతంలో ఇండియా కూటమికి జనాలను దూరమవుతున్నారు. సనాతన ధర్మంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ మాటలు కౌబెల్ట్ ఏరియాలో చాలా డ్యామేజ్ ఇండియా కూటమికి జరుగుతోంది. డీఎంకే ఇండియా కూటమిలో ఈ కూటమి నాశనాన్ని చేస్తోంది.

ఇక పార్టీగా ఇండియా కూటమిని డీఎంకే నాశనం చేస్తుంటే.. ఇక రెండోది ఇండియా కూటమిని నాశనం చేస్తోంది రాహుల్ గాంధీ. ఇండియా కూటమికి సంబంధం లేకుండా రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు కూటమికి తీవ్ర నష్టం చేకూరుస్తాయి. రక్షణ , భద్రత, జాతీయ భావాలపై రాహుల్ వ్యాఖ్యలు నష్టం తెస్తున్నాయి.

ఇండియా కూటమిని దెబ్బతీస్తున్న పార్టీలు, వ్యక్తులు, అంశాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.