Janasena : జనసేన ఆంధ్రాలో, తెలంగాణాలో పొత్తుల్ని ఎలా చూడాలి?

పవన్ మద్దతుదారులు ఎవ్వరూ కూడా వైసీపీ చానెల్స్ చూడడం లేదు. ఇటువంటి వార్తలను ఎవ్వరూ నమ్మడం లేదు. దీనివల్ల జగన్ కే బెడిసికొడుతుంది.

Written By: NARESH, Updated On : October 31, 2023 1:11 pm

Janasena : ఆంధ్రాలో రాజకీయాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి దీనికి ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇంతటి నీచ సంస్కృతికి పార్టీ నేతలను ఎలా ప్రేరేపిస్తున్నాడు. తన చానెళ్లను ఉపయోగిస్తున్నాడు? ఎవరో పవన్ కళ్యాణ్ ఆఫీసులోంచి గెంటివేయబడ్డ ఉద్యోగి బయటకొచ్చి వీడియోలు చేస్తే.. ఆయన్ను పట్టుకొచ్చి మీ సాక్షి సహా పలు వైసీపీ చానెల్స్ లో చూపించి ఇతడిని హైలెట్ చేసి పవన్ క్యారెక్టర్ హాసాసియేషన్ ను చేయడం దిగజారుడు రాజకీయాలు కావా? జగన్ అంటూ అందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది.

పవన్ ఎంత హుందాగా ఏపీలో రాజకీయం చేస్తున్నాడు? మీ కుటుంబాన్ని ఎవరూ జనసేనలో విమర్శించవద్దని పవన్ నేతలకు హుకూం జారీ చేశాడు. మీ ఆడవాళ్లను గౌరవంగా చూశాడు. కానీ మీరేం చేస్తున్నారండీ.. పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని స్వయంగా ప్రతీ మీటింగ్ లో విమర్శిస్తున్నారు. ఇది జగన్ సంస్కారమా? అని అడుగుతున్నారు.. ఇదే జనాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.

పవన్ మద్దతుదారులు ఎవ్వరూ కూడా వైసీపీ చానెల్స్ చూడడం లేదు. ఇటువంటి వార్తలను ఎవ్వరూ నమ్మడం లేదు. దీనివల్ల జగన్ కే బెడిసికొడుతుంది.

ఇక పవన్ కళ్యాణ్ బీజేపీతో తెలంగాణలో పొత్తులు తెలుగు రాజకీయాలను మార్చేశాయి. జనసేన ఆంధ్రాలో, తెలంగాణాలో పొత్తుల్ని ఎలా చూడాలి? అన్న దానిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.