Save Money: డబ్బు ప్రతి ఒక్కిరికీ అవసరమే. నేటి కాలంలో జీవితాన్ని డబ్బే నడిపిస్తుందని కొందరు అంటుంటారు. ఈ తరుణంలో ఆదాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆదాయం అందరికీ ఒకలా ఉండదు. అలాగని ఎప్పటికీ ఒకేలా రాదు. దీంతో ఆదాయం ఎక్కువగా వచ్చినప్పుడు ఖర్చులు పోను కొంత పొదుపు చేయాలి. అయితే కొందరు పొదుపు గురించి మరిచిపోయి ఖర్చులు విపరీతంగా పెట్టేస్తారు. దీంతో భవిష్యత్ లో ఏర్పడే అత్యవసరానికి డబ్బు అందకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతారు. డబ్బు పొదుపు చేయాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఏవిధంగా పొదుపు చేయాలి? అనే విషయంలో పొరపాట్లు చేస్తారు. అయితే కొన్ని టిప్స్ ద్వారా డబ్బు పొదుపు చేయడం వల్ల డబ్బు నిల్వ అవుతుంది. ఆ టిప్స్ ఏంటంటే?
గణిత శాస్త్రంలో కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ కావాలంటే ప్రత్యేక సూత్రాలు ఉంటాయి. అలాగే డబ్బు పొదుపు చేయడంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. వాటి ప్రకారంగా పొదుపు చేసుకుంటూ వెళ్లడం ద్వారా ఎన్నో లాభాలు ఉంటాయి. ఒక్కోసారి కొందరికి ఆకస్మిక ఆదాయం వస్తుంది. ఒక్కోసారి అసలే ఉండదు. ఇలాంటి సమయంలో ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించాలి? అసలేం చేయాలి?
తక్కువ ఆదాయం ఉన్నప్పుడే..
ఆదాయం అందరికీ ఒకేలా ఉండదు. కొందరికీ తక్కువ.. మరికొందరికి ఎక్కువ రావొచ్చు. అయితే ఎక్కువ ఆదాయం వస్తేనే పొదుపు చేస్తా.. అనే భావన ఉండకూడదు. ఆదాయం ఎంత ఉన్నా అందులో కొంత పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ అలవాటు ఎక్కువ ఆదాయం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండిపోయి డబ్బును ఆదా చేసినవారవుతారు.
ఖర్చులెన్ని ఉన్నా పొదుపు మరువద్దు:
ఒక్కనెలా అదనపు ఖర్చులు ఉంటాయి. ఇలా ఖర్చులు ఉన్నాని పొదుపు చేయడం మానొద్దు. పొదపు కోసం ముందుగానే బడ్జెట్ కేటాయించాలి. అవసరమనుకుంటే అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. పొదుపు క్రమంగా ఉండడం వల్ల ఆదాయం ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది.
షాపింగ్ లో అనవసర వస్తువుల జోలికి వద్దు:
షాపింగ్ చేసేటప్పుడు కొన్ని ఆకర్షణీయమైన వస్తువులు కనిపిస్తాయి. అవి అవసరం లేకున్నా కొందరు కొనుగోలు చేస్తారు. ఇలా చేయడం వల్ల ఖర్చుల భారం పెరిగిపోతంది. ఏ షాపుకు వెళ్లినా అవసరం ఉన్నవాటినే కొని తెచ్చుకోండి. అలా చేయడం వల్ల డబ్బు ఆదా అవుతుంది.
రుణాలు ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు:
కొన్ని అవసరాల నిమిత్తం రుణాలు తీసుకున్నవారు వాటిని చెల్లించడంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఇలా చెల్లించడం ఆపేస్తే వాటి వడ్డీ భారం ఎక్కువవుతంది. ఇవి కూడా అదనపు ఖర్చులే అనుకోవాలి. అందువల్ల ఎలాంటి ఈఎంఐ ఉన్నా సకాలంలో చెల్లించడం ఉత్తమం.