Homeఆంధ్రప్రదేశ్‌How to Abolish Caste System : కుల వ్యవస్థ పోవాలంటే ఏం చేయాలి?

How to Abolish Caste System : కుల వ్యవస్థ పోవాలంటే ఏం చేయాలి?

How to Abolish Caste System : కుల వ్యవస్థ రాజకీయాల్లో విద్వేషాలు రెచ్చగొడుతోంది. కోనసీమలో ఉద్రిక్తతలకు దారితీసింది. కులం అనేది సమాజ అభివృద్ధికి ఆటంకం తప్పితే.. సమాజ పురోభివృద్ధికి ఏమాత్రం ఇది దోహదపడుతుంది. ముఖ్యంగా ఆంధ్రాలో కుల వ్యవస్థ వేళ్లూనుకొని ప్రజలను విభజించి ఈ కుల గొడవలకు కారణమవుతోంది.

తెలంగాణలో కుల వ్యవస్థ ఇంతగా లేదు. నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణ ప్రజలు వివక్షకు గురై నాడు అందరూ ఏకతాటిపైకి ఉన్నారు. వారిలో ఈ కుల కట్టుబాట్లు చాలా తక్కువ. కలిసి పోరాడి సాధించుకున్నారు. 1956లో ఆంధ్రాతో కలిశాక ఈ కుల జాఢ్యం విస్తరించింది.

2014లో కూడా ఉద్యమ రూపంలోనే తెలంగాణ ఏర్పడింది కానీ కులం గుర్తింపుతో రాజకీయాలు నడవలేదు. ఆంధ్రాకు, తెలంగాణకు చాలా తేడా ఉంది. ఆంధ్రాలో ఇప్పుడు కుల జాఢ్యం ఎక్కువైపోయింది. రేవంత్ రెడ్డి ‘రెడ్లకే పగ్గాలు ’ అప్పగించాలనడంతో ఈ కుల జాఢ్యం పెరిగింది.

కుల వ్యవస్థ పోవాలంటే హిందూయిజం బలపడాలన్నది ఆర్ఎస్ఎస్ మాట.. కానీ ఇది సరైన పద్ధతి కాదన్నది విశ్లేషకుల భావన. కుల వ్యవస్థ అంతరించడం అన్నది దేశంలో అసాధ్యమనే చెప్పాలి. దీర్ఘకాలంలో పోయే అవకాశాలు ఉంటాయి. పట్టణీకరణ కారణంగా ఈ కుల జాఢ్యం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఆధునికత భావాల విస్తరణతో కూడా కులజాఢ్యం తగ్గుతుంది. పెళ్లిళ్లు ఇప్పటికే కులాలు పట్టించుకోకుండా చేసుకుంటున్నారు. ఇది కూడా కుల వ్యవస్థ దెబ్బతినడానికి దారితీస్తుంది. గ్లోబలైజేషన్ కూడా కులాలు మరుగన పడడానికి కారణం అవుతోంది.

కుల వ్యవస్థ పోవాలంటే ఏం చేయాలన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు.
Recommended Videos:
కులంతో సహజీవనం ఇప్పట్లో పోదు ? || How to Abolish Caste System || Ok Telugu
వైసీపీ మంత్రులపై రెచ్చిపోయిన టీడీపీ లీడర్ || TDP Leader Sensational Comments on YCP Ministers
చేతకాని సీఎం మన జగన్ || Public Talk on CM Jagan Government || Ongole Public Talk || Ok Telugu
కులంతో సహజీవనం ఇప్పట్లో పోదు ? || How to Abolish Caste System || Ok Telugu

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version