Ravi Teja Remuneration: పరిశ్రమలో రవితేజకు మంచి ఇమేజ్ ఉంది. స్వశక్తితో స్టార్ గా ఎదిగిన హీరోగా ఆయన చాలా మందికి స్ఫూర్తి. అలాంటి రవితేజ రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలకు చుక్కలు చుపిస్తున్నాడనే వార్త పరిశ్రమలో ప్రముఖంగా వినిపిస్తోంది. క్రాక్ ముందు వరకు రవితేజ కెరీర్ ఒడిదుడుకులతో సాగింది. వరుస పరాజయాలతో ఆయన డీలా పడ్డారు. హీరోగా రవితేజ కెరీర్ ముగిసినట్లే అన్న దశలో క్రాక్ హిట్ అయ్యింది. ప్రతికూల పరిస్థితుల మధ్య విడుదలైన ఈ మూవీ సాలిడ్ వసూళ్లు సాధించింది. క్రాక్ విడుదల నాటికి తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు ఎత్తేయలేదు. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ నడుస్తున్నాయి.
క్రాక్ హిట్ తో రవితేజకు ఆఫర్స్ వెల్లువెత్తాయి. ఒకటికి నాలుగు చిత్రాలు ప్రకటించాడు. ప్రస్తుతం రవితేజ హీరోగా రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ధమాకా చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఖిలాడి మూవీ విడుదలై అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఖిలాడి మూవీ విషయంలో దర్శక నిర్మాతలతో రవితేజకు విభేదాలు తలెత్తాయి. ఖిలాడి ప్రీరిలీజ్ వేడుక సాక్షిగా ఈ గొడవలు బయటపడ్డాయి. రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ ఒకరిపై మరొకరు సెటైర్స్ వేసుకున్నారు.
Also Read: Mahesh- Trivikram: మహేష్ తో అయినా కొత్తగా ట్రై చెయ్ త్రివిక్రమ్!
తర్వాత పబ్లిక్ గా ఆరోపణలు చేసుకున్నారు. ఈ ప్రభావం ఖిలాడి చిత్ర ఫలితంపై చూపింది. ఖిలాడి చిత్ర నిర్మాతగా ఉన్న కోనేరు సత్యనారాయణను అధిక రెమ్యూనరేషన్ కోసం రవితేజ ఇబ్బంది పెట్టారట. మరలా అదే సమస్య రామారావు ఆన్ డ్యూటీ చిత్ర నిర్మాతలకు ఎదురవుతుందట. పరిస్థితులు అర్థం చేసుకోకుండా రవితేజ రామారావు చిత్రం నిర్మాతలను అధిక రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. రవితేజ వ్యవహారం సదరు నిర్మాతలకు మింగుడు పడడం లేదట. సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగా… రవితేజ కొత్త సమస్యలు సృష్టిస్తున్నాడట.
రవితేజ ధనదాహానికి నిర్మాతలు బలవుతున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత రవితేజ ఫాలో అవుతున్నట్లుంది. వరుసగా మరో రెండు ప్లాప్స్ పడితే అవకాశాలు గల్లంతు కావడం ఖాయం. కాబట్టి చేతిలో ఉన్న సినిమాలతోనే మాక్సిమమ్ లగేయాలని డిసైడ్ అయినట్లున్నాడు.
Also Read:Telangana Rains: వానలు వచ్చేవి అప్పుడే.. మరో 4 రోజులు హైఅలెర్ట్
Recomended Videos