ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య ఎక్కువనే సంగతి తెలిసిందే. సంప్రదాయాల్లో బంగారం భాగం కావడంతో మన దేశంలో బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. పెళ్లి సమయంలో, పండుగల సమయంలో ఎక్కువమంది బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. బంగారం తాకట్టు పెట్టడం ద్వారా తక్కువ సమయంలో రుణం పొందే అవకాశం ఉంటుంది.
Also Read: రూ.10కే ఘుమఘుమలాడే బిర్యానీ.. ఎక్కడంటే?
బంగారాన్ని కొనుగోలు చేయడం ద్వారా మనకు ఆర్థికభద్రత కూడా లభిస్తుంది. అయితే ఒక వ్యక్తి దగ్గర ఎంత బంగారం ఉండాలనే ప్రశ్నకు చాలామందికి సమాధానం తెలియదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత బంగారం ఉన్నా ఏం కాదని అయితే పెళ్లైన మహిళలు 500 గ్రాముల వరకు బంగారం కలిగి ఉండవచ్చని తెలిపింది. పెళ్లి కాని మహిళలు మాత్రం 250 గ్రాముల బంగారం కలిగి ఉండవచ్చు.
Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. స్కీమ్ లో చేరితే రూ.3.75 లక్షలు..?
పురుషులు 100 గ్రాముల వరకు బంగారం కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఈ పరిమితిని మించే బంగారం కొనుగోలు చేస్తే మాత్రం కొనుగోలు చేసిన బంగారానికి లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. లెక్కకు మించిన బంగారానికి డాక్యుమెంట్ ప్రూఫ్స్ ను కలిగి ఉండాలి. సరైన ఆధారాలను చూపించకపోతే మాత్రం బంగారాన్ని స్వాధీనం చేసుకునే అధికారం అధికారులకు ఉంటుంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
కొత్తగా బంగారం కొనుగోలు చేసేవాళ్లు కూడా బంగారం కొనుగోలు చేసినట్టు రిసిప్ట్ లను తీసుకోవాలి. బంగారానికి రిసిప్ట్ లు లేకపోయినా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బంగారం కొనుగోలు చేసేవాళ్లు ఈ నిబంధనలపై అవగాహన కలిగి ఉంటే మంచిది.