సహాయాలు మూడు రకాలుగా ఉంటాయి. అవసరానికి సహాయం చేసి.. వడ్డీతో పుచ్చుకునేవి మొదటివి. ఇది వ్యాపార మనస్తత్వం! పబ్లిసిటీ కోసం సహాయం అందించడం రెండోది. గోరంత సాయం చేసి కొండంత ప్రచారం చేసుకుంటారు! ఇక మూడోది ఎలా ఉంటుందంటే.. కుడి చేత్తో సాయం అందిస్తే.. ఎడమ చేతికి కూడా తెలియదు. ఆదుకోవాలన్న మనసుకు మాత్రమే తెలుస్తుంది!
Also Read: బన్నీతో కేజీఎఫ్ డైరెక్టర్ ‘తీన్ మార్’!
మొదటి రెండురకాలకు చెందినవారు అడుగడుగునా ఉంటారు. మూడో రకానికి చెందిన వారు మాత్రం అత్యంత అరుదుగా ఉంటారు. వారిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు అంటున్నాడు టాలీవుడ్ కమెడియన్ సత్య! చిరులోని మంచితనాన్ని, బాబాయి పవన్ లోని సేవాగుణాన్ని అలవర్చుకున్నాడని చెబుతున్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వివరాలు వెల్లడించాడు సత్య.
ఇటీవల శర్వానంద్ ‘శ్రీకారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరు హెల్పింగ్ నేచర్ ను ఆకాశానికి ఎత్తేశాడు శర్వానంద్. మెగాస్టార్ లోని ఆ తత్వం చెర్రీకి మాత్రమే వచ్చిందని అన్నాడు. అసలు, చిరును ఆ వేడుకకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టింది కూడా రామ్ చరణే అని సమాచారం. ఈ వేడుకలో తన ఫ్రెండ్ గురించి చాలా చెప్పాడు శర్వా. అతని రుణం తీర్చుకోలేనిదని అన్నాడు.
Also Read: టీవీ టిక్కెట్టుః RRR 200 కోట్లు, వీరమల్లు 150 కోట్లు!
ఇప్పుడు సత్యమాట్లాడుతూ.. తాను కష్టాల్లో ఉన్నప్పుడు తనకు కూడా డబ్బు సాయం చేశాడని వెల్లడించాడు. తనకే కాదు ఇంకా ఎంతో మంది సహాయం చేశాడని, కానీ.. చెర్రీ ఎవ్వరికీ చెప్పుకోడు అని తెలిపాడు. ఇక, జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీనుకు రామ్ చరణ్ చేసిన సహాయానికి.. శ్రీను ఏకంగా గుడి కట్టిస్తాడని చెప్పాడు.
ఇంకా.. రామ్ చరణ్ తో తనకున్న అనుబంధాన్ని కూడా వెల్లడించాడు సత్య. సినిమా సెట్లో చెర్రీ చాలా సాధారణంగా ఉంటాడని తెలిపాడు. రంగస్థలం సినిమా సమయంలో సాదాసీగా ఉంటూ మా అందరితో కలిసి ఎన్నోసార్లు సాధారణ భోజనం చేశాడని చెప్పాడు. ఎక్కడా స్టార్ హోదా చూపించుకోని మంచి మనసున్న వ్యక్తి రామ్ చరణ్ అని తెలిపాడు సత్య.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్