https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. స్కీమ్ లో చేరితే రూ.3.75 లక్షలు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వ్యవసాయ రంగంలోనే బిజినెస్ చేయాలని భావించే వాళ్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేంద్రం ప్రస్తుతం అమలు చేస్తున్న స్కీమ్ లలో సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ కూడా ఒకటి. ఉద్యోగం కొరకు వెతుకుతున్న యువతకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఈ స్కీమ్ లో చేరడం ద్వారా డబ్బుతో పాటు ఉపాధిని పొందే అవకాశం ఉంటుంది. Also Read: బంగారం ఎక్కువగా ఉన్నవారికి షాకింగ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 18, 2021 / 12:08 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వ్యవసాయ రంగంలోనే బిజినెస్ చేయాలని భావించే వాళ్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేంద్రం ప్రస్తుతం అమలు చేస్తున్న స్కీమ్ లలో సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ కూడా ఒకటి. ఉద్యోగం కొరకు వెతుకుతున్న యువతకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. ఈ స్కీమ్ లో చేరడం ద్వారా డబ్బుతో పాటు ఉపాధిని పొందే అవకాశం ఉంటుంది.

    Also Read: బంగారం ఎక్కువగా ఉన్నవారికి షాకింగ్ న్యూస్..?

    ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లు మినీ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ల్యాబ్ ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చు. దేశంలో రైతు కుటుంబాలు ఎక్కువ సంఖ్యలో ఉండగా ప్రయోగశాలలు తక్కువ సంఖ్యలో ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేసి భూసార పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ప్రతి నమూనాకు 300 రూపాయల చొప్పున పొందవచ్చు.

    Also Read: నెలకు రూ.1,900 చెల్లిస్తే కొత్త స్కూటర్ పొందే ఛాన్స్..?

    18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న గ్రామీణ యువత సులభంగా ఈ ప్రయోగశాలను ఓపెన్ చేయవచ్చు. సైన్స్ సబ్జెక్టుతో మెట్రిక్యులేషన్ కలిగి ఉండి అగ్రి క్లినిక్, వ్యవసాయ వ్యవస్థాపక శిక్షణను పూర్తి చేసిన వాళ్లు ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ల్యాబ్ ఏర్పాటు కోసం రూ.5 లక్షలు ఖర్చు కాగా ఏకంగా 3.75 లక్షల రూపాయలు సబ్సిడీ లభిస్తుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    లక్షా 25 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ స్కీమ్ లో సులభంగా చేరవచ్చు. జిల్లా వ్యవసాయ డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. agricoop.nic.in వెబ్‌సైట్‌ లేదా 1800 – 180 – 1551 నంబర్ కు కాల్ చేయడం ద్వారా ఈ స్కీమ్ లో చేరవచ్చు.