G-20 : జీ-20 కోసం భారత్ ఎంత ఖర్చు చేసిందంటే?

జీ_20 సమావేశాలకు 30 మంది దేశాధినేతలతో పాటు 14 మంది అంతర్జాతీయ సంస్థల అధినేతలు హాజరయ్యారు..

Written By: NARESH, Updated On : September 10, 2023 3:53 pm

G20 summit

Follow us on

G-20 : భారత్ మండపాన్ని నిర్మించింది. మురికివాడలను తొలగించింది. ఎక్కడికక్కడ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. భారతీయ సనాతన ధర్మాన్ని ప్రతిబింబించేలాగా చిత్రాలు రూపొందించింది. భారీ విగ్రహాలను ఏర్పాటు చేసింది. ఇక అతిధుల కోసం ప్రత్యేక విడిది గృహాలను కేటాయించింది. వారికి బస, భోజనాలు ఒక రేంజ్ లో ఏర్పాటు చేసింది. శనివారం మొదలైన సభలు ఆదివారంతో ముగుస్తాయి..ఇవీ జీ_20 శిఖరాగ్ర సమావేశాల కోసం భారత్ చేసిన ఏర్పాట్లు.. ఇంతకీ ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి భారత్ ఎంత ఖర్చు చేసింది?

జీ_20 సమావేశాలకు 30 మంది దేశాధినేతలతో పాటు 14 మంది అంతర్జాతీయ సంస్థల అధినేతలు హాజరయ్యారు.. కొన్ని నివేదికల ప్రకారం ఈ శిఖరాగ్ర సదస్సు కోసం భారత్ 4100 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు చేసినట్టు సమాచారం. రహదారులు, సెక్యూరిటీ, ఫుట్ పాత్ లు, లైటింగ్ ఇతర పనుల కోసం ఈ డబ్బును ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. మేక్ ఓవర్ ప్రక్రియలో భాగంగా దేశ రాజధాని లోని వివిధ ప్రదేశాలలో శిల్పాలు కూడా ఏర్పాటు చేసింది. జీ_20 శిఖరాగ్ర సమావేశాల కోసం గతంలో ఇతర దేశాలు కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేశాయి. 2018లో బ్యూనస్ ఎయిర్ సమ్మిట్ ఖర్చు 112 మిలి ల్యన్ డాలర్లు.. 2010 టొరంటోలో జరిగిన సమ్మిట్ కోసం కెనడా 715 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. వరి శిఖరాగ్ర సమావేశం 2022 నవంబర్ లో జరిగింది. 2024 జీ_20 సమావేశాలు బ్రెజిల్ లో జరుగుతాయి.

జీ_20 సదస్సు అనేది ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి.. ఈ శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించే దేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఏర్పాట్ల విషయంలో ఎటువంటి తేడా రాకుండా చూసుకుంటుంది. భారీగా ఖర్చు పెడితే పెట్టుబడులు, వివిధ రకాల ఒప్పందాలు తమ దేశం ప్రాతిపదికగా జరుగుతాయని భావిస్తుంది. లో జరిగిన శిఖరాగ్ర సమావేశాల్లో ఇదే జరిగింది కాబట్టి.. భారత్ కూడా ఇదే విధానాన్ని అనుసరించింది. అయితే ఈ విధానాన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పుపడుతున్నప్పటికీ.. అధికార భారతీయ జనతా పార్టీ మాత్రం ఏమాత్రం లెక్క చేయడం లేదు. ఢిల్లీలోని మురికివాడలను ప్రస్తుతం తొలగించిన నేపథ్యంలో.. వారికి పునరావాసాన్ని కల్పించే ఆలోచనను ప్రభుత్వం చేస్తోంది.