https://oktelugu.com/

సుకన్య సమృద్ధి ఖాతా ఉందా.. బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఆడపిల్లలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో సుకన్య సమృద్ధి స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఇతర స్కీమ్ లతో పోలిస్తే ఈ స్కీమ్ లో చేరడం వల్ల ఎక్కువ మొత్తం వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి కనీసం 250 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు ఆడపిల్లల తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి ఖాతాలలో డిపాజిట్ చేయవచ్చు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 2, 2021 / 06:42 PM IST
    Follow us on

    కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఆడపిల్లలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో సుకన్య సమృద్ధి స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఇతర స్కీమ్ లతో పోలిస్తే ఈ స్కీమ్ లో చేరడం వల్ల ఎక్కువ మొత్తం వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. సంవత్సరానికి కనీసం 250 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు ఆడపిల్లల తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి ఖాతాలలో డిపాజిట్ చేయవచ్చు.

    Also Read: ఇంటి నుంచే ఆధార్ అప్ డేట్ చేసుకునే ఛాన్స్.. ఎలా అంటే..?

    పది సంవత్సరాల లోపు ఆడపిల్లలు మాత్రమే ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 7.6 శాతం వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్రం సుకన్య సమృద్ధి స్కీమ్ వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా పొందే అవకాశాలు ఉంటాయి. ఈ స్కీమ్ లో చేరడం ద్వారా ఆడపిల్లలకు ఆర్థిక భద్రత లభిస్తుంది.

    Also Read: ప్రపంచం త్వరలోనే అంతం.. డూమ్స్ డే క్లాక్ ఏం చెబుతోందంటే..?

    పోస్టాఫీస్ లేదా బ్యాంక్ కు వెళ్లి సులభంగా సుకన్య సమృద్ధి ఖాతాను ఓపెన్ చేయవచ్చు. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్కీమ్ ద్వారా సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారికి ప్రయోజనం చేకూరుతుంది. సుకన్య సమృద్ధి ఖాతాలో బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఖాతాకు నెట్ బ్యాంకింగ్ ఉండాలి. నెట్ బ్యాంకింగ్ ద్వారా సులభంగా బ్యాలెన్స్ ను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ప్రస్తుతం కొన్ని బ్యాంకులు మాత్రమే నెట్ బ్యాంకింగ్ సర్వీసులు అందిస్తున్నాయి. ఈ విధంగా కాకుండా పాస్ బుక్ ప్రింట్ తీసుకోవడం ద్వారా కూడా బ్యాంక్ బ్యాలెన్స్ సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా బ్యాలెన్స్ తెలుసుకోవడం సాధ్యం కాకపోతే పాస్ బుక్ ను ప్రింట్ తీసుకోవడం ద్వారా కూడా బ్యాలెన్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది